Viral Video: నా పేరు చెప్పుకోండి..! భారతదేశంలో తొలిసారి కనిపించిన అరుదైన అందమైన జంతువు ఇది..
కానీ, కుక్కల అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ జంతువు చాలా నెమ్మదిగా నడుస్తూ వచ్చి..ఆపై కదలకుండా ఓ చోట కూర్చుంటుంది. కుక్క సైజులో ఉన్న ఆ జంతువు చూసేందుకు పిల్లిలా కనిపించింది.

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుంటాయి. అయితే, మీరు గతంలో మునుపెన్నాడూ చూడని అరుదైన జంతువుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలోని జంతువును చూసి నెటిజన్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. వీడియోలో కనిపించిన వింత జంతువు చూసేందుకు బాగా బలిసిన పిల్లిలాగా కనబడుతుంది. కానీ, సరిగ్గా తరచి చూస్తే దాని ఆకారం విచిత్రంగా ఉంది. దాని తలపై కొమ్ముల్లాంటి చెవులు చిత్రంగా కనిపించాయి. దాంతో నెట్టింట ఈ వింత జంతువు చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.
వైరల్‌గా మారిన ఈ వింత జంతువు వీడియోని IFS అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. ఈ జంతువును “హిమాలయన్ లింక్స్” అని పిలుస్తారట. ఇప్పటివరకు ఇలాంటి జంతువును భారత్ లో చూడలేదని, మొదటిసారి ఇక్కడ గుర్తించినట్లు అతగాడు తెలిపాడు. ఇది హిమాలయ లింక్స్ భారతదేశంలో కనిపించే అడవి పిల్లులలో ఒకటి. అందమైన, అరుదైన జీవి. లేహ్-లడఖ్‌లో కనువిందు చేసింది. వైరల్‌గా మారిన ఈ 45-సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో చుట్టుపక్కల కుక్కలు ఎడతెగకుండా మొరగుతుండగా ఫెరల్ పిల్లిలా కనిపించే జంతువు ఒకటి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కానీ, కుక్కల అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ జంతువు చాలా నెమ్మదిగా నడుస్తూ వచ్చి..ఆపై కదలకుండా ఓ చోట కూర్చుంటుంది. కుక్క సైజులో ఉన్న ఆ జంతువు చూసేందుకు పిల్లిలా కనిపించింది.




A beautiful and rare animal found in India. In Ladakh region. Not many have heard about it. Guess what. Via @fatima_sherine. pic.twitter.com/dCqnawVsrs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2023
ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అది చాలా ఫన్నీగా ఉందని అంటే, మరికొంతమంది అది చాలా భయానకంగా ఉందంటున్నారు. కొందరు చాలా చిత్ర విచిత్రంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ జంతువును లడఖ్ ప్రాంతంలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఆ జంతువుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..