Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable Mini AC: అబ్బ.. ఎంతచల్లటి కబురు..! కూలర్ కంటే చౌకైన ఏసీ.. కరెంట్‌ అవసరం కూడా లేకుండానే..

ఇది త్వరగా గది వేడి ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలోకి తీసుకువస్తుంది.. ఇది గదిని వేగంగా చల్లబరుస్తుంది. మీరు దీన్ని మార్కెట్ నుండి కొనుగోలు చేయకూడదనుకుంటే,

Portable Mini AC: అబ్బ.. ఎంతచల్లటి కబురు..! కూలర్ కంటే చౌకైన ఏసీ.. కరెంట్‌ అవసరం కూడా లేకుండానే..
Portable Mini Ac
Follow us
Jyothi Gadda

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 08, 2023 | 1:36 PM

ఎండాకాలం మొదలైంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ ఏసీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరాఘాతంతో చాలా మంది ఏసీకి బదులుగా కూలర్‌ని ఎంచుకుంటారు. కానీ, ఇప్పుడు కూలర్ కంటే చౌకగా లభించే ఏసీ మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ, అది ఇచ్చే చల్లదనం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఏసీ ఆన్‌లైన్ మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. వినియోగదారులు కూడా ఈ ఏసీని పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

పోర్టబుల్ మినీ ఏసీ ధర: చాలా కంపెనీలు తమ మినీ ఎయిర్ కండీషనర్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టాయి. ఈ మినీ ఏసీలు రూ.2 వేల లోపు లభిస్తున్నాయి. ఈ పోర్టబుల్ AC మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంది. అయితే ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అవును, ఈ మినీ పోర్టబుల్ ఏసీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1500కి కొనుగోలు చేయవచ్చు.

ఈ AC గదికి అనుగుణంగా రూపొందించబడింది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఒక చోటు నుండి మరో చోటకు తీసుకువెళ్లడం సులభం. ఇది గదిలో ఎక్కడైనా అమర్చవచ్చు. ప్రత్యేకంగా ఇది విద్యుత్తుతో నడిచేది కాదు. దీనికి USB కనెక్టర్ ఉంది. దీన్ని చాలా సులభంగా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయవచ్చు. అంటే ఇంట్లోనే కాకుండా ఆఫీసులో, బయట ఎక్కడైనా వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది త్వరగా గది వేడి ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలోకి తీసుకువస్తుంది.. ఇది గదిని వేగంగా చల్లబరుస్తుంది. మీరు దీన్ని మార్కెట్ నుండి కొనుగోలు చేయకూడదనుకుంటే, మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను సరిగ్గా చూసి తీసుకోండి. పైన ఇచ్చినది కేవలం సమాచారం కోసమే.. ఇది గమనించగలరు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..