AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

student exam stress: తల్లీదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త..! ఎందుకంటే ఇది పరీక్షల కాలం..! మీ పిల్లలు జర భద్రం..

త 20 రోజుల్లోనే 4గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారంటే... ఈ ఎగ్జామ్సు, మార్కులు, ర్యాంకుల ప్రెజర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

student exam stress: తల్లీదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త..! ఎందుకంటే ఇది పరీక్షల కాలం..! మీ పిల్లలు జర భద్రం..
Students Stress Level
Jyothi Gadda
|

Updated on: Mar 02, 2023 | 5:05 PM

Share

ఒకరా ఇద్దరా… వేల మంది విద్యార్థులు.. కార్పొరేట్‌ కాలేజీల ధనదాహానికి బలైపోతున్నారు. కన్నవారికి కడుపుకోతలు మిగులుస్తున్నారు. ఏటేటా ఇలా నేలరాలుతున్న పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఆ సంఖ్య చూస్తే… ఎంత మంది తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారో అర్థమవుతుంది. కానీ, ఈ నెంబర్‌… ర్యాంకుల్ని చూసే కార్పొరేట్‌ గద్దలకు ఎలా అర్థమవుతుంది. సాత్విక్‌ ఆత్మహత్యతో… జైళ్లలాంటి కార్పొరేట్‌ హాస్టల్స్‌లో విద్యార్థులు ఎదర్కొంటున్న భయానక పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒక్క సాత్విక్‌మ మాత్రమే కాదు… గత కొన్నేళ్లుగా ఎంతో మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిళ్లతోనే ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా, 1995 నుండి 2021 వరకు లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మ హత్య చేసుకున్నారు. 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా విద్యార్థుల ఆత్మహత్యలు బాగా పెరగడం బాధాకరం.

2018లో 428 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా… అందులో 196మంది అమ్మాయిలు, 232మంది అబ్బాయిలు ఉన్నారు. 2019లో ఆ సంఖ్య 426 కాగా, అందులో మేల్‌ 249, ఫిమేల్‌ సంఖ్య 177గా ఉంది. 2020లో విద్యార్థుల ఆత్మహత్యలు 489కి పెరిగాయి. అందులో 184మంది ఆడపిల్లలు, 305మంది అబ్బాయిలు ఉన్నారు. 2021లో 567 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే… అందులో 227మంది అమ్మాయిలు, 340 మంది అబ్బాయిలు.. కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చారు.

జాతీయ వైద్య కమిషన్ నివేదిక ప్రకారం గడిచిన ఐదేళ్లలో… దేశ వ్యాప్తంగా 119 మంది మెడికల్ విద్యార్థులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇక, తెలంగాణలో సగటున ఏడాదిలో 350 మంది విద్యార్థులు అత్మహాత్య చేసుకుంటున్నారు. 2014 నుండి 2021 వరకు… 3500మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్ సి ఆర్బీ డేటా ప్రకారం ఇందులో 23శాతం మంది ఇంటర్ విద్యార్థులే ఉన్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో చాలా కేసుల ఇప్పటికే విచారణలో ఉన్నాయి. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా.. కార్పొరేట్ కాలేజీలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఇలాంటి ఇష్యూకు సంబంధించి… 2018 లోనే శ్రీ చైతన్య , నారాయణ కాలేజీ లకు నోటీసులు పంపింది తెలంగాణ హైకోర్టు.

ఇవి కూడా చదవండి

నెలకు సగటున 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం పరీక్షలు దగ్గరపడుతుండటం… చదవాలంటూ, తల్లిదండ్రులు, కాలేజీలు ఒత్తిడి చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలు ప్రాణాలు తీస్కోవడమే శరణ్యమనుకుంటున్నారు. గత 20 రోజుల్లోనే 4గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారంటే… ఈ ఎగ్జామ్సు, మార్కులు, ర్యాంకుల ప్రెజర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం..