Gas Saving Tips: వంట గ్యాస్‌ను ఎలా ఆదా చేసుకోవాలో తెలుసా..? ఇలా చేస్తే డబ్బు కూడా సేవ్‌ చేసుకోవచ్చు..

Gas Tips : వంటగ్యాస్ ధర బాగా పెరిగింది. కాబట్టి.. వంట గ్యాస్‌ని జాగ్రత్తగా వాడుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. వంటగ్యాస్‌ ఆదా చేసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. దాంతో ఒకరకంగా ఆర్థికంగా కూడా పొదుపు చేసినట్టే అవుతుంది.

Jyothi Gadda

|

Updated on: Mar 02, 2023 | 3:20 PM

వంట చేసేటప్పుడు స్టవ్‌ ఎప్పుడూ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. మీడియం నుండి తక్కువ వేడి మీద వంటచేయాలి. మంట పెద్దగా పెట్టి వంట చేస్తే.. గిన్నెకు చుట్టురా మంట వ్యాపించి గ్యాస్ వృథాను పెంచుతుంది. గ్యాస్ ఆదా చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగించండి.

1 / 7
గ్యాస్ ఆదా చేయడానికి వంటచేస్తున్నప్పుడు మూతపెట్టి ఉడికించాలి. గ్యాస్‌ను తక్కువ మంటపై ఉంచి మూతపెట్టి ఉడికించటం వల్ల స్టీమింగ్ ద్వారా ఆహారం ఉడికిపోతుంది. అవసరమైతే ప్రెషర్ కుక్కర్ ఉపయోగించండి. ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల వంట గ్యాస్‌ను సులభంగా ఆదా చేసుకోవచ్చు.

2 / 7
బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. బర్నర్‌లో ధూళి పేరుకుపోతే, గ్యాస్ ఎక్కువగా వినియోగించబడుతుంది. గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో బర్నర్‌ను శుభ్రం చేయండి. ప్రతి 3 నెలలకు ఒక నిపుణుడిచే శుభ్రం చేయించుకోండి.

3 / 7
Gas Saving Tips: వంట గ్యాస్‌ను ఎలా ఆదా చేసుకోవాలో తెలుసా..?  ఇలా చేస్తే డబ్బు కూడా సేవ్‌ చేసుకోవచ్చు..

4 / 7
ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ నుండి బయటకు తీసిన తర్వాత నేరుగా గ్యాస్‌పై వేడి చేయవద్దు.  అలా చేస్తే ఆహారాన్ని వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ గ్యాస్ వినియోగిస్తుంది.  ఫ్రిజ్ నుండి ఆహారాన్ని బయటకు తీసిన తర్వాత ముందుగా సాధారణ గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి.  అప్పుడు దానిని వేడి చేయండి.

5 / 7
వంట చేసే ముందు గిన్నేలో నీళ్లు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ గిన్నేలో నీళ్లు ఆవిరై గిన్నే వేడేక్కాలంటే.. గ్యాస్ వృధా అవుతుంది.  గిన్నేను కడిగి పొడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు గ్యాస్ మీద పెట్టాలి.

6 / 7
వంటకు కావాల్సిన అన్ని పదార్థాలను సేకరించి వంట ప్రారంభించండి.  కూరగాయలు మొత్తం కట్‌ చేసుకుని రెడీగా పెట్టుకోండి. కావాల్సిన మసాలాలూ కూడా అందుబాటులో ఉంచుకోండి. ఇవన్నీ అప్పటికప్పుడే సిద్ధం చేస్తుంటే..వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ ఖర్చు పెరుగుతుంది.  ఈ చిట్కాతో వంట చేయడం వల్ల గ్యాస్ ఖర్చు ఆదా అవుతుంది.

7 / 7
Follow us