Salam air : 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. గాల్లో ఉండగా ఇంజిన్‌లోంచి పొగలు..!

విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని పైలట్ గుర్తించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Salam air : 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం..  గాల్లో ఉండగా ఇంజిన్‌లోంచి పొగలు..!
Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 02, 2023 | 4:25 PM

నాగ్‌పూర్‌లో సలామ్ ఎయిర్ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. చిట్టగాంగ్ నుంచి మస్కట్ వెళ్లే సలామ్ ఎయిర్ విమానంలో 200 మంది ప్రయాణికులు ఉండగా, విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని పైలట్ గుర్తించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

గురువారం ఒక ప్రకటన ప్రకారం, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుండి మస్కట్‌కు బయలుదేరిన సలామ్ ఎయిర్ విమానం ఇంజన్‌లో పొగ కనిపించడంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి బయలుదేరిన విమానంలో 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. సిబ్బంది, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.

సలామ్ ఎయిర్ విమానం (చిట్టగాంగ్-మస్కట్) ఇంజిన్ నుండి పొగలు వెలువడుతున్నట్లు పైలట్ గుర్తించడంతో గత రాత్రి నాగపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..