Viral Video: అమ్మో అక్కో..! అది నాలుకా..? నాగుపామా..? మరీ అంత పొడవుందేంటీ బాబోయ్‌..!

సాధారణంగా చాలామంది తమ నాలుకను ముక్కుకు తాకడానికి ప్రయత్నిస్తుంటారు. వారి నాలుక ఎంత పొడవుగా ఉందో చూపించుకోవడానికి..! అయితే వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ అమ్మాయి తన నాలుకను బయటకు లాగి చూపించిన తీరుతో అందరూ షాక్ అవుతున్నారు.

Viral Video: అమ్మో అక్కో..! అది నాలుకా..? నాగుపామా..? మరీ అంత పొడవుందేంటీ బాబోయ్‌..!
Woman's Long Tongue
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 02, 2023 | 1:42 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి.. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు మన కళ్లను మనమే నమ్మలేనట్టుగా చేస్తుంటాయి. ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువుల నాలుకలు చాలా పొడవుగా ఉంటాయి. అవి దూరంగా కూర్చుని తమ ఎరను పట్టుకోగలవు. కొన్ని జంతువులు తమ ఎరను గుర్తించడానికి కూడా తమ నాలుకను ఉపయోగిస్తుంటాయి. పాములు, ఊసరవెల్లులు వంటి వందలాది వాటికి పొడవైన నాలుకలు ఉంటాయి. అయితే పాములా నాలుక పొడవున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? సాధారణంగా చాలామంది తమ నాలుకను ముక్కుకు తాకడానికి ప్రయత్నిస్తుంటారు. వారి నాలుక ఎంత పొడవుగా ఉందో చూపించుకోవడానికి..! అయితే వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ అమ్మాయి తన నాలుకను బయటకు లాగి చూపించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

సాధారణంగా, వ్యక్తుల నాలుకలు చాలా పొడవుగా ఉంటాయి. కానీ, ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి నాలుకను చూస్తే మాత్రం మీరు ఖచ్చతింగా భయపడతారు. ఆమె నాలుక పొడవు చూస్తే బాబోయ్‌ అది నాలుకా..? నాగుపామా..? అని సందేహించక మారరు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో మహిళ కారులో కూర్చొని ఉంది. ఆమె తన పెదవులను తన వేళ్ళతో కదిలిస్తూ.. నోటిలోంచి నాలుకను బయటకు తీస్తుంది. ఎర్రటి నాలుక మెల్లగా బయటకు రావడం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమె తన నాలుకను బయటకు తీసి.. ఒకసారి మెలిక తిప్పి మళ్లీ లోపలికి లాగేసుకుంది. ఈ 4 సెకన్ల వీడియోని నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

@uncensoredpromo అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వింత వీడియో పోస్ట్ చేయగా సోషల్ మీడియా వినియోగదారులు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. వైరల్ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. చాలా మంది స్పందించారు. ప్రపంచంలో అత్యంత పొడవైన నాలుక రికార్డు కాలిఫోర్నియాకు చెందిన నిక్ స్టోయిబెర్ల్ పేరిట ఉంది. ఆ నాలుక పొడవు 3.97 అంగుళాలు. కానీ ఇక్కడ చూస్తున్న యువతి నాలుకను చూసి మాత్రం మేము ఆశ్చర్యపోతున్నామంటూ కామెంట్‌ చేశారు కొందరు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..