Gold Seized: బంగారం స్మగ్లింగ్ ఇలా కూడా చేస్తారా..? ఏం తెలివిరా నాయనా..! డౌటే రాకుండా దేశాలు దాటేస్తున్నారు..!
గతంలో కూడా ఐదుగురి నుంచి రెండున్నర కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ తనిఖీల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వారి స్మగ్లింగ్ స్టైల్ చూసి కంగుతిన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలే అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం స్మగ్లర్లకు మంచి రవాణా మార్గంగా మారింది. వరుసగా మూడో రోజు కూడా ఓ విదేశీ ప్రయాణికుడి నుంచి బంగారం పట్టుబడింది. దీంతో ఈ ఏడాది కేరళలో అత్యధికంగా బంగారం స్మగ్లింగ్ సాగుతున్న విమానాశ్రయాల్లో కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటిగా నిలిచింది. కన్నూరు బంగారం స్మగ్లింగ్‌కు కారిడార్‌గా మారడంతో కస్టమ్స్ నిఘాను ముమ్మరం చేసింది. తాజాగా కన్నూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.24 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో వచ్చిన కాసర్‌గోడ్‌కు చెందిన మహ్మద్ షిహాబుద్దీన్ నుంచి 439 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా బంగారం కనిపించింది. ఎమర్జెన్సీ లైట్‌లోని బ్యాటరీ బాక్స్‌లో, కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. చిన్నారుల దుస్తులపై బటన్ల రూపంలో కూడా బంగారం దొరికింది.
గతంలో కూడా ఐదుగురి నుంచి రెండున్నర కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ తనిఖీల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కంగుతిన్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని మూడు మాత్రల రూపంలో మలద్వారంలో దాచి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.. 847 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో వెలికితీయగా 795 గ్రాముల బంగారం లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.45,15,600 ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..