AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatwave Alert: వామ్మో మాడు పగిలే ఎండలు.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా అస్సలు చేయకండి..

మార్చి మొదలవడంతోనే సూర్యుడు మాడు పగులకొడుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటాయోననే భయం జనాల్లో కలుగుతోంది. ఈసారి వచ్చేది ఎండాకాలం కాదు మండే కాలమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Heatwave Alert: వామ్మో మాడు పగిలే ఎండలు.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా అస్సలు చేయకండి..
Heatwave Alert
Shaik Madar Saheb
|

Updated on: Mar 02, 2023 | 1:33 PM

Share

Heatwave Advisory: మార్చి మొదలవడంతోనే సూర్యుడు మాడు పగులకొడుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులు ఎలా ఉంటాయోననే భయం జనాల్లో కలుగుతోంది. ఈసారి వచ్చేది ఎండాకాలం కాదు మండే కాలమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్య నుంచే భానుడు ప్రతాపం కనిపిస్తోంది. సాధారణంగా ఫిబ్రవరిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకంటే ఈసారి కనీసం 5 డిగ్రీల అధిక టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఫిబ్రవరి నెల నుంచి సూర్యప్రతాపం అధికంగా కనిపిస్తోంది. గడిచిన 30 ఏళ్ల కాలంలో ఫిబ్రవరి నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా ఉన్నాయి. కాని ఈసారి మాత్రం ఉష్గోగ్రతల్లో 5 నుంచి 10 డిగ్రీల పెరుగుదల కనిపించింది. చాలా ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిపించాయి. మార్చి, ఎప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. 45 డిగ్రీల వరకు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 50 డిగ్రీలు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో సంభవించే ఎల్‌ నినో కారణంగా ఈ ఎండా కాలం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్ల కొరత, భూగర్భ జలాలు అడుగంటడం, వ్యవసాయానికి కష్టాలు తప్పవని అంటున్నారు. ఈ పరిస్థితి కరువుకు దారితీయకపోయినా, సాధారణ జీవనానికి, ఆర్థిక పరిస్థితులకు సమస్యగా మారవచ్చు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు.. ఆహారంపై దృష్టిసారించాలని కోరుతున్నాయి. ఎండాకాలం నేపథ్యంలో తగినంత వైద్య, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు.. సౌకర్యాలు, అవసరమైన మందులు, పరికరాల లభ్యతను సమీక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..

దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. ఇంకా పండ్ల రసాలు.. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మకాయ, నారింజ వంటి తాజా పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆ సమయంలో బయటకు వెళ్లకండి..

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లడాన్ని నివారించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలివేయకూడదని కూడా సిఫార్సు చేసింది. ఇంకా, ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది. సూర్యరశ్మి తగ్గిన తర్వాత బయటకు వెళ్లడం, ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు పోవడం మంచిదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వీటికి దూరంగా ఉండండి..

ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు, కారం, నూనెతో చేసిన ఆహారాన్ని నివారించండి. సూర్యుడు అత్యంత వేడిగా ఉన్నప్పుడు వంట చేయడం మానేయాలి. సులభంగా జీర్ణమయ్యే భోజనాన్ని చేయడం.. కొంచెం కొంచెం తినడం అలవర్చుకోవాలి. పీక్ హీట్ గంటలలో పని చేయడం/వ్యాయామం చేయడం మానుకోవాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..