Viral Video: సాధువులా మారిన పెద్దపులి..! జాలి చూపిస్తే ఎలాగుంటాదో తెలుసా..? ఇదిగో ఇట్టాగే మరీ..

పులి సాధువు ప్రవర్తన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది ఆకలితో ఉంటే తప్ప ఎవరిపైనా దాడి చేయదంటూ కామెంట్‌ చేస్తున్నారు. అడవిలో అందరూ పారిపోయే పులి ముందు ఈ జింక నిలబడి ఉంది.

Viral Video: సాధువులా మారిన పెద్దపులి..!  జాలి చూపిస్తే ఎలాగుంటాదో తెలుసా..? ఇదిగో ఇట్టాగే మరీ..
Tiger And Deer
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 02, 2023 | 1:11 PM

ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఎన్నో ర‌కాల జంతువులు నివ‌సిస్తుంటాయి. కానీ, అందులో పులిని మించిన హింసాత్మక జంతువు లేదు. జూలో బోనులో నుండి పులి గర్జన వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. పెద్ద పులులు, సింహాల‌కు మిగ‌తా జంతువులు భ‌య‌ప‌డి పారిపోతుంటాయి. ఆ జంతువుల‌ను భ‌క్షించేందుకు పులులు, సింహాలు వేటాడుతుంటాయి. అయితే తాజాగా ఇలాంటి పాత సిద్ధాంతాలు, ప్రజల భయాందోళనలు, సంప్రదాయ ఆలోచనలు ఇలా అన్నింటిని పూర్తిగా దుమ్ము దులిపేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో జింక ఎదురుగా రాగానే పులి పైకి లేచి నాకేందుకు తలనొప్పి అన్నట్టుగా పక్కకు వెళ్లిపోయింది. జింక అంతటి సాధు జీవిని పులి ఏమీ అనకుండానే వెళ్లిపోయింది.

ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో అడవి మధ్యలో ఒక పులి హాయిగా కూర్చుని ఎరగా ఎదురు చూస్తోంది.. ఆ సమయంలో పులి ఎదురుగా ఒక జింక వచ్చింది. జింకను తదేకంగా చూసిన ఆ పులి.. పైకి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ జింక గుండా వెళుతుంది. కానీ దానిపై దాడి చేయదు. ఈ ఘటన చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

IFS అధికారి రమేష్ పాండే ఈ వీడియోకు క్యాప్షన్‌లో పులి సాధువుగా మారిందని చెప్పారు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు., మీ వల్ల తనకు హాని కలగనంత వరకు అది మీమల్ని ఏమీ అనదు. వీలైనంత వరకు, అవి తన ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి.

ఈ వీడియోను మార్చి 1 బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఉత్తరాఖండ్‌లోని అటవీ పరిశోధనా సంస్థ షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోకు 76.6K వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పులి సాధువు ప్రవర్తన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది ఆకలితో ఉంటే తప్ప ఎవరిపైనా దాడి చేయదంటూ కామెంట్‌ చేస్తున్నారు. అడవిలో అందరూ పారిపోయే పులి ముందు ఈ జింక నిలబడి ఉంది. ఇక్కడ జింక ధైర్యాన్ని కూడా పొగుడుతున్నారు మరికొందరు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..