Telangana: నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మటన్ క్యాంటీన్లు

ఈ మ‌ట‌న్ క్యాంటీన్ల‌లో మ‌ట‌న్ బిర్యానీతో పాటు పాయ‌, గుర్దా ఫ్రై, ప‌త్తార్ కా గోస్ట్, కీమా వంటి రుచిక‌ర‌మైన వంట‌కాలు అందుబాటులో ఉండ‌నున్నాయి.

Telangana: నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మటన్ క్యాంటీన్లు
Mutton
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 02, 2023 | 6:17 PM

మీరు నాన్ వెజ్ లవర్సా..? అందులోనూ మ‌ట‌న్ అంటే లొట్టలేసుకుంటూ తింటారా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మ‌ట‌న్ క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. స్టేట్ షిప్ అండ్ గోట్ డెవ‌ల‌ప్‌మెంట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ మ‌ట‌న్ క్యాంటీన్ల‌లో తెలంగాణ స్పెషల్… నోరూరించే మ‌ట‌న్ బిర్యానీతో పాటు చాలామంది ఇష్టపడే పాయ‌, కీమా, గుర్దా ఫ్రై, ప‌త్తార్ కా గోస్ట్  వంటి టేస్టీ మటన్ ఐటమ్స్ ఎన్నో అందుబాటులో ఉంటాయి.

అయితే ఫస్ట్ క్యాంటీన్‌ను కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ ఆఫీసు ఉన్న శాంతిన‌గ‌ర్ కాల‌నీలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్యాంటీన్ ఈ మార్చిలోనే స్టార్టవ్వనుంది. అయితే మెనూతో పాటు రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు. స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే మట‌న్ వంట‌కాల‌ను అందిస్తామని షిప్ అండ్ గోట్ డెవ‌ల‌ప్‌మెంట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ తెలిపింది.

ఫిష్ క్యాంటీన్లలాగానే మ‌ట‌న్ క్యాంటీన్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫిష్ క్యాంటీన్ల‌లో ఫిష్ క‌ర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి చాలా వంట‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిష్ క్యాంటీన్లు సక్సెస్‌ఫుల్‌గా న‌డుస్తుండ‌టంతో.. మ‌ట‌న్ క్యాంటీన్ల‌ను కూడా అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఫెడ‌రేష‌న్ చైర్మ‌న్ దూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే