Modelling: లో దుస్తుల యాడ్స్‌లో అమ్మాయిలను రీప్లేస్ చేస్తున్న అబ్బాయిలు.. రీజన్ తెలిస్తే షాక్..

సాధారణంగా వ్యాపార ప్రకటనల్లో అమ్మాయి లేని యాడ్‌ ఉండదు. ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి యాడ్‌లోనూ అమ్మాయిలను చూపించడం ఎక్కువైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వ్యాపార ప్రకటనల్లో అమ్మాయిలను చూపించరాదని నిషేధం విధించింది.

Modelling: లో దుస్తుల యాడ్స్‌లో అమ్మాయిలను రీప్లేస్ చేస్తున్న అబ్బాయిలు.. రీజన్ తెలిస్తే షాక్..
China Banned Woman From Modelling Lingerie
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2023 | 12:12 PM

చైనాలో కొన్ని వ్యాపార సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకోడానికి యువతులకు బదులు అబ్బాయిలను రంగంలోకి దించారు. అమ్మాయిల లో దుస్తులను అబ్బాయిలకు వేసి యాడ్స్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. షేక్‌స్పియర్‌ కాలం మళ్లీ రిపీట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా వ్యాపార ప్రకటనల్లో అమ్మాయి లేని యాడ్‌ ఉండదు. ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి యాడ్‌లోనూ అమ్మాయిలను చూపించడం ఎక్కువైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వ్యాపార ప్రకటనల్లో అమ్మాయిలను చూపించరాదని నిషేధం విధించింది. ఆన్‌లైన్‌ ప్రచారాలకు కూడా మహిళలను వినియోగించరాదని చట్టాన్ని సైతం తీసుకొచ్చింది. లోదుస్తులు ప్రకటనల్లో అమ్మాయిలను చూపించడం సరికాదని, దీనివల్ల అశ్లీలత పెరగడమే కాకుండా, మరింత ప్రోత్సహించినట్టవుతుందని ఈ నిషేధాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది.

దీంతో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా ప్రమోట్‌ చేయాలో తెలియక తీవ్రంగా నష్టపోయాయి. దాంతో ఇక లాభం లేదనుకున్న సదరు వ్యాపార సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలకు బదులు అబ్బాయిలకే వాటిని వేసి యాడ్స్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. షేక్‌స్పియర్‌ కాలం మళ్లీ రిపీట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..