Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Reunuion: భారత్‌లో తమ్ముడు .. పాక్‌లో అన్న.. ఇరు కుటుంబాలను 75ఏళ్ల తర్వాత కలిపిన సోషల్ మీడియా

దేశ విభజన అనేక కుటుంబాలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అనేక కుటుంబాలను చిన్న భిన్నం చేసింది. కుటుంబ సభ్యులు ఎవరికెవరు కాకుండా విడిపోయారు. అలా దేశ విభజనలో విడిపోయిన రెండు కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని కలుసుకున్నారు. ఈ కలయికకు వేదికగా మారింది పాకిస్థాన్.

Family Reunuion: భారత్‌లో తమ్ముడు .. పాక్‌లో అన్న.. ఇరు కుటుంబాలను 75ఏళ్ల తర్వాత కలిపిన సోషల్ మీడియా
Sikh Family Reunuion
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2023 | 1:03 PM

బిటిష్ పాలకులు భారత దేశాన్ని విడిచి పెడుతూ.. అఖండ భారత దేశాన్ని విడగొట్టారు. 1947 లో భారత దేశం, పాకిస్థాన్ గా దేశవిభజన జరిగింది. ఈ విభజన అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అనేక కుటుంబాలను చిన్న భిన్నం చేసింది. హిందూ, ముస్లిం, సిక్కులు ఊచకోతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఎవరికెవరు కాకుండా విడిపోయారు. అలా దేశ విభజనలో విడిపోయిన రెండు కుటుంబాలు తాజాగా కలుసుకున్నాయి. 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని కలుసుకున్నారు. ఈ కలయికకు వేదికగా మారింది పాకిస్థాన్. వివరాల్లోకి వెళ్తే..

1947 భారత్ – పాకిస్తాన్ దేశవిభజన సమయంలో విడిపోయిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లోని కర్తార్‌పూర్ కారిడార్‌లో కలుసుకున్నారు. ఇరుకుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చూసుకుంటూ భావోద్వేగంలో మునిగిపోయారు. పాటలు పాడుతూ తమ ఆనందాన్ని పూల వర్షంలా కురిపించారు. ఈ సోదరులిద్దరూ హర్యానాకు చెందినవారు.

భారత్ లో ఒకరు.. పాక్ లో మరొకరు

ఇవి కూడా చదవండి

దేశ విభజన సమయంలో హర్యానాకు చెందిన సోదరులు గురుదేవ్ సింగ్, దయా సింగ్ హర్యానాలోని మహేంద్రనగర్ జిల్లాలోని గోమ్లా గ్రామంలో నివసించే వారు. తండ్రి మరణంతో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తండ్రి ఫ్రెండ్ కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజన తర్వాత కరీం బక్ష్  పాకిస్థాన్ కు వలస వెళ్తుంటే.. అతనితో పాటు గురుదేవ్ సింగ్ పాకిస్తాన్ కు వలస వెళ్ళాడు. అయితే గురుదేవ్ తమ్ముడు దయా సింగ్ మాత్రం తన మేనమామతో కలిసి హర్యానాలో మాత్రం ఉండిపోయాడు. అలా 75 ఏళ్ల క్రితం అన్నదమ్ములిద్దరూ విడిపోయారు.

పాక్ లో గురుదేవ్ సింగ్: 

పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత, పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝంగ్ జిల్లాలో కరీం బక్ష్ స్థిరపడ్డాడు. అక్కడ గురుదేవ్ సింగ్ ముస్లింగా మారాడు.. అతని పేరు.. గులాం మహమ్మద్‌గా మారింది. అయితే గురుదేవ్ సింగ్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అయితే గురుదేవ్ సింగ్ కు తన తమ్ముడిని చూడాలి.. కలుసుకోవాలని మనసులో ఉంది. దీంతో చాలా ఏళ్ళు భారత ప్రభుత్వానికి లెటర్స్ రాశాడు.. అయితే అతని కోరిక తీరకుండానే.. మరణించాడు.

సోషల్ మీడియా  కలుసుకున్న అన్నదమ్ముల ఫ్యామిలీ:

గురుదేవ్ కుమారుడు ముహమ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి.. తన తమ్ముడు దయా సింగ్ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశాడని చెప్పారు. దయ సింగ్ ఆచూకీని కోరుతూ తన తండ్రి చాలా సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాడని చెప్పాడు. అయితే ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా తమ పిన తండ్రి దయా సింగ్‌ను ఆచూకీని కనుగొనగలిగామని చెప్పాడు.  అనంతరం.. సిక్కులకు పవిత్ర స్థలమైన కర్తార్ పూర్ సాహిబ్ లో కలుసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు తమ పూర్వీకులు నివసించిన హర్యానాలోని ఇంటిని సందర్శించాలని తమ కోరిక అని.. అందుకోసం భారత ప్రభుత్వం వీసాలు ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు ముహమ్మద్ షరీఫ్ చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..