AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. సీటు ఎడ్జెస్ట్‌తో ఏకంగా 8 మంది ప్రయాణం.. వీడియోపై ఓ లుక్ వేయండి..

మీరు బైక్‌పై ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ప్రయాణించడం చూసి ఉంటారు.. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఒకరిద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది బైక్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. అవును.. ఇది జోక్ కాదు.. నిజం. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. సీటు ఎడ్జెస్ట్‌తో ఏకంగా 8 మంది ప్రయాణం.. వీడియోపై ఓ లుక్ వేయండి..
Jugaad Video
Surya Kala
|

Updated on: Mar 11, 2023 | 12:40 PM

Share

సోషల్ మీడియా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే.. చాలా ప్రత్యేకం అనిపిస్తుంది ఎవరికైనా. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా  దేశీయ జుగడ్ కు చెందిన వీడియోలను చూడడానికి నెటిజన్లు చాలా ఆసక్తిని కనబరుస్తారు. విపరీతంగా షేర్ చేస్తారు. దీంతో ఇలాంటి వీడియోలు అన్ని రకాల వీడియోల కంటే వేగంగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జుగడ్ వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఎవరైనా సరే షాక్ తినాల్సిందే.

జుగడ్ తయారీ దారులు తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటారు. ఇలాంటి జుగాద్ టెక్నాలజీని అందరూ ఉపయోగించలేరు. కొంతమందిలో మాత్రమే అటువంటి ప్రతిభ దాగి ఉంటుంది. వీరు మాత్రమే అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి సరికొత్త వస్తువులను తయారు చేస్తారు. మీరు బైక్‌పై ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ప్రయాణించడం చూసి ఉంటారు.. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఒకరిద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది బైక్‌పై ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. అవును.. ఇది జోక్ కాదు.. నిజం. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో వ్యక్తి తన బైక్‌ను జుగాద్ ద్వారా మోడిఫై చేసి.. ఎక్కువ మంది వ్యక్తులు బైక్ పై కూర్చునేలా దాని సీటును పొడిగించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బైక్ ఇద్దరికి మాత్రమే సరిపోతుంది అనుకునేవారికి ఆశ్చర్యం కలిగించేలా ఈ బైక్‌పై క్షణాల్లో ఎనిమిది మంది కూర్చున్నారు. చాలా మంది దానిపై కూర్చున్నారు. ఈ జుగాడ్ వీడియో చూసిన నెటిజన్లు ఓ వైపు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే.. మరోవైపు  ఇలా చేయవద్దని ప్రమాదం అంటూ అభ్యర్థించారు.

ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.  పలువురు కామెంట్లు కూడా చేశారు.  ఈ వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డుపైకి వచ్చారని ఒకరంటే.. మరొకరు  చిన్న పొరపాటు జరిగితే ఈ వ్యక్తులకు ఏమి జరుగుతుందో దేవుడికే తెలుసన్నారు. ఈ వీడియోనే ప్రమాదాన్ని ఆహ్వానించబోతోందన్నారు ఇంకొకరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.