Viral News: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి.. ఇక భరించలేను.. 24గంటల్లోనే డైవర్స్ అంటూ ప్రకటన

సోఫీ మారీ పెళ్లి విషయంలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్ వినియోగదారులలో చర్చకు దారితీసింది. అప్పట్లో ఆమెకు అనేక మంది మద్దతుగా నిలిచారు. ఎవరిని వారు గౌరవించుకోవాలన్న విషయాన్ని చాలా గొప్పగా చాటిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

Viral News: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి.. ఇక భరించలేను.. 24గంటల్లోనే డైవర్స్ అంటూ ప్రకటన
Sofi Maure
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2023 | 4:13 PM

వెర్రి వేయి విధాలు అన్నారు పెద్దలు.. ఇంకా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికీ ఆనందం అనిపించకమానదు కొందరు చేస్తున్న పనులను చూస్తే.. గత కొంతకాలంగా తమని తాము పెళ్లి చేసుకుంటున్న యువత గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అలా తనని తాను పెళ్లి చేసుకున్న ఓ యువతి 24 గంటలు కూడా గడవకమునుపే విడాకులు తీసుకుంటానంటూ ప్రకటించింది. ఈ యువతి ప్రకటన నెట్టింట్లో ప్రస్తుతం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.  అంతేకాదు ఈ యువతి చేసిన ప్రకటనపై నెటిజన్లకు చిర్రెత్తేలా చేస్తోంది.

25 ఏళ్ల సోఫీ మారీ అనే యువతి ఫిబ్రవరి 20న తన పెళ్లి విషయాన్ని ప్రకటించింది. తనను తాను పెళ్లి చేసుకోనున్నానని తెలిపింది.  తెల్లటి పెళ్లి గౌను, బంగారు తలపాగా ధరించి.. పెళ్లి దుస్తులతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. “ఈ రోజు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైంది. నేను నా పెళ్లి కోసం దుస్తులను కొనుగోలు చేసాను..  నన్ను నేను వివాహం చేసుకోవడానికి వెడ్డింగ్ కేక్ తయారు చేసుకున్నాను  ” అని ఆమె ఫిబ్రవరి 20న ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

సోఫీ మారీ పెళ్లి విషయంలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్ వినియోగదారులలో చర్చకు దారితీసింది. అప్పట్లో ఆమెకు అనేక మంది మద్దతుగా నిలిచారు. ఎవరిని వారు గౌరవించుకోవాలన్న విషయాన్ని చాలా గొప్పగా చాటిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.  స్వీయ-ప్రేమ విలువను ప్రదర్శించింది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే తనని తాను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ మళ్ళీ ప్రకటించి.. 24గంటలు గడవక ముందే సోఫీ మారీ మళ్ళీ మరో సంచలన విషయం బయటపెట్టింది. తాను ఈ పెళ్లితో విసిగిపోయానని.. తన వల్ల కాదంటూ వరుస కామెంట్లతో  హోరెత్తించింది. చివరకు తనను తాను డైవర్స్ ఇవ్వనున్నాని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో.. నెటిజన్లలో కొందరు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక నెటిజన్ “మీరు మీ గౌరవించుకోవడానికి, స్వీయ-ప్రేమను, అవమానాన్ని లేదా మిమ్మల్ని కౌగిలించుకోవడానికి ఒక తండ్రిని కొనుగోలు చేసుకోవాలని తాను కోరుకుంటున్నాను.” అని వ్యంగ్యంగా స్పందించారు. మనుషుల మూర్ఖత్వానికి అంతే లేదంటూ మరికొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. “ఇది నీ వెర్రి.. పో, ఎవరైనా ఏమి చెప్పాలి,” అని మరొకరు వ్యాఖ్యానించారు. “గ్రేట్!! ఐ విల్ బ్యాంక్ యు!! వాట్ ఎ గుడ్ ఐడియా!! బ్రిలియంట్!! వావ్!! వాట్ ఎ కవర్!” అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. చాలా మంది మిమ్మల్ని మీరు గొప్ప చూపించుకోవడానికి .. గుర్తింపు పొందడానికి వివాహ వ్యవస్థతో పరాచకాలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!