Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఏడాది మొత్తంలో ఎనిమిదేనా?.. మన టార్గెట్ 35.. వందే భారత్‌ రైళ్ల ఉత్పత్తిపై పార్లమెంట్‌ ప్యానెల్‌ ప్రశ్నలు..

ఏడాదిలో ఎనిమిదేనా.. వందే భారత్‌ రైళ్ల ఉత్పత్తిపై పార్లమెంట్‌ ప్యానెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్ల తయారీలో మరింత వేగం పెంచాలని సూచించింది.

Vande Bharat Express: ఏడాది మొత్తంలో ఎనిమిదేనా?.. మన టార్గెట్ 35.. వందే భారత్‌ రైళ్ల ఉత్పత్తిపై పార్లమెంట్‌ ప్యానెల్‌ ప్రశ్నలు..
Vande Bharat Train
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 14, 2023 | 9:42 AM

దేశంలోని రైల్వే వ్యవస్థను పరుగులు పెట్టించి చరిత్ర సృష్టిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ కొత్తతరం రైళ్లు దూసుకువస్తుండగా.. ఇతర మార్గాల్లోనూ ప్రవేశపెట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వీటి తయారీలో ఉన్న వేగంపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఒకటి ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 8 రైళ్లను మాత్రమే తయారు చేయడాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రాధా మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో రైల్వేలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన 14వ నివేదికను పార్లమెంట్‌కు సోమవారం సమర్పించింది. ఉత్పత్తిని వేగవంతం చేయాలని రైల్వే శాఖకు సూచించింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి 35 వందే భారత్‌ రైళ్లను ఉత్పత్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 8 వందే భారత్ రైళ్లను మాత్రమే ఉత్పత్తి చేసిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇలాగైతే అనుకున్న టార్గెట్‌ను అందుకోవడం కష్టమని అభిప్రాయపడింది. 2022-23 బడ్జెట్‌ ప్రసంగంలో 400 వందే భారత్‌ రైళ్లను ప్రకటించారని, 2023 ఫిబ్రవరి 17 నాటికి రైల్వే శాఖ 10 రైళ్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చిందని కమిటీ గుర్తు చేసింది.

ఇప్పటి వరకు మొత్తం 400 వందే భారత్‌ రైళ్లను దశలవారీగా తమ ప్రొడక్షన్‌ యూనిట్లోనే తయారు చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో లాతూర్‌లోని మరాఠ్వాడా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 120, చెన్నై ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ప్యాక్టరీలో 80, సోనిపట్‌లోని రెయిల్‌ కోచ్‌ నవీనీకరన్‌ కర్మాగారంలో 100, రాయ్‌బరేలీలోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 100 చొప్పున వివిధ టెక్నాలజీ పార్టనర్స్‌తో కలిసి రూపొందించేందుకు నిర్ణయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ICF, RCF, MCFలో 35 రైళ్లు తయారు చేయాలని రైల్వే శాఖ టార్గెట్‌గా పెట్టుకోగా.. రైల్వే ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని తీసుకుని ఉత్పత్తిని వేగవంతం చేయాలని స్టాండింగ్‌ కమిటీ సూచించింది.

మరిన్ని జాతీయవార్తల కోసం