AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఈ గ్రామంలోని డ్వాక్రా మహిళలు వెరీ వెరీ స్పెషల్.. ఎందరికో స్పూర్తి.. ఎంతో మందికి చేయూత.. ఎక్కడంటే?

నెలకు ఒకొక్క మహిళ రూ.10 నుంచి 15 వేలు సంపాదిస్తున్నారు. ఖాళీ సమయంల్లో పనులకు వెళ్లుతూ మిగిలిన సమయంలో బనియన్ల తయారీ కేంద్రంలో పని చేస్తున్నారు. బ్యాంకులో రూ.1.16 లక్షలు డిపాజిట్ చేశారు. గతంలో అప్పులు తెచ్చి నడిపిన మహిళలు నేడు లాభాల భాటలో యూనిట్ ను నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Success Story: ఈ గ్రామంలోని డ్వాక్రా మహిళలు వెరీ వెరీ స్పెషల్.. ఎందరికో స్పూర్తి.. ఎంతో మందికి చేయూత.. ఎక్కడంటే?
Komatlagudem Dwakra Women
Surya Kala
|

Updated on: Mar 11, 2023 | 8:20 AM

Share

నెలకొండపల్లి మండలం కొరట్ల గూడానికి చెందిన మహిళలు వారు పెద్ద చదువులు చదుకోలేదు అయినా తాముఎదో ఒకటి చేయాలనుకున్నారు. కుటుంబ ఆర్దిక అవసరాలకు చేదోడు కావాలనుకున్నారు. కానీ ఏం చేయాలి.. ఎలా ప్రారంభించాలి ఇదే ఆలోచన ఇలాంటి తరుణంలో పొదుపు చేస్తే ఎలా ఉంటుంది?అన్న ఆలోచన ఆమహిళల్లో కలిగిoది. దీంతో రోజు చేస్తున్న పనులతో వచ్చే ఆదాయంలోనే కొంత పొదుపు చేసుకున్నారు. క్రమేపి ఆర్దికంగా నిలదోక్కున్నారు. ఫలితం ఓ కుటీర పరిశ్రమకు యజమనులయ్యారు. బనియన్ల తయారీ కేంద్రంను నెలకొల్పి పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకోడపల్లి మడలం కోరట్లగుడెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు...

తాము పేదరికం నుంచి బయటపడాలని ,ఆర్దిక పరిపుష్టి సాధించాలన్న ఆశతో కోరట్లగుడెం గ్రామానికి చెందిన 20 మంది మహిళలు సాధన ,స్వయం కృషి పేర్లతో రెండు డ్వాక్రా సంఘలను ఏర్పాటు చేసుకున్నారు.ఒక్కొక్కో సంఘంలో 10 మంది సభ్యులు గా చేరారు. రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.౩౦ వంతున మూడు సంవత్సరాలు పొదుపు చేశారు.వీరి క్రమశిక్షణ పట్టుదలను గమనించిన డీ ఆర్డీ ఏ అధికారులువారిని ప్రోత్సహించారు. కేవలం పొదుపు తోనే సరిపోదని ఆర్దికంగా అభివృద్ధి సాధించటానికి ఓ చిన్న తరహ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. బనియన్ల తయారీ లో నలుగు నెలలు శిక్షణ ఇచ్చారు.డీ ఆర్డిఏ నుంచి రూ. 2 లక్షలు, SBH బ్యాంకు నుంచి రూ.2 లక్షలు రుణం మంజూరు చేశారు. శిక్షణ పొదిన మహిళలు బనియన్ల తయారీ కేంద్రంను 2002 లో ప్రారంభించారు. బనియన్ల తయారీ తో డ్రాయర్లు తయారీ చేపట్టారు.

మహిళలు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల్లో బనియన్ల ను విక్రయిస్తున్నారు. బనియన్ల విక్రయాలు ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. నెలకు ఒకొక్క మహిళ రూ.10 నుంచి 15 వేలు సంపాదిస్తున్నారు. ఖాళీ సమయంల్లో పనులకు వెళ్లుతూ మిగిలిన సమయంలో బనియన్ల తయారీ కేంద్రంలో పని చేస్తున్నారు. బ్యాంకులో రూ.1.16 లక్షలు డిపాజిట్ చేశారు. గతంలో అప్పులు తెచ్చి నడిపిన మహిళలు నేడు లాభాల భాటలో యూనిట్ ను నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోరట్ల గూడెం గ్రామ మహిళల ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో అనేక అవార్డులతో పాటు రాష్ట్రస్థాయిలో కూడా అనేక బహుమతులు వచ్చాయి . వీరు తయారు చేసిన బనియన్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా వీళ్లు తయారు చేసిన బనీలను విక్రయిస్తారు. బనీనుల పరిశ్రమ ద్వారా ఈ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరో కొంతమందికి ఉపాధి చూపిస్తూ జిల్లాలోనే ఆదర్శ గ్రూపుగా పేరు ఉంది. వీరిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో కొంతమందికి ఉపాధి కల్పిస్తామంటున్న మహిళలు.

Reporter: Narayana Rao

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..