Bandi Sanjay: కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డ బండి సంజయ్.. ‘ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్’ అంటూ..

తెలంగాణ సమాజం తల వంచదని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. దొంగ సారా వ్యాపారం చేయమని తెలంగాణా సమాజం చెప్పిందా..? ఎవరి కోసం..

Bandi Sanjay: కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డ బండి సంజయ్.. ‘ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్’ అంటూ..
Bandi Sanjay
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 11, 2023 | 8:30 AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్‌లోని సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరిగిన ఉపాధ్యాయ–అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ‘మీరిచ్చే తీర్పు కోసం‌ తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు(శుక్రవారం) కేసీఆర్ పెట్టిన సమావేశం సంతాప సమావేశంలా ఉంది. ఆయన ఢిల్లీ వెళ్లి దొంగ దీక్ష చేస్తున్నారు. తెలంగాణ సమాజం తల వంచదని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. దొంగ సారా వ్యాపారం చేయమని తెలంగాణా సమాజం చెప్పిందా..? ఎవరి కోసం వ్యాపారం చేసింది..? వంద కోట్ల దందా చేసినవ్.. తెలంగాణ ఉద్యోగులకు జీతాలివ్వడానికి , నిరుద్యోగ భృతి ఇవ్వడానికి దొంగ దందా చేసనవా..?’ అంటూ బీఆర్ఎస్‌పై ప్రశ్నలు సంధించారు.

ఇంకా ‘అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ, ఎంఎల్‌సీ కవిత అరెస్టులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సమానని.. బీఆర్ఎస్‌లోకి వచ్చేవాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ లీడర్లే అని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న ఘనుడు కేసీఆర్ అని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో నడుస్తున్నాయన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలేనని.. సీఎం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం సిగ్గు చేటని విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!