AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: ఈ ఆహారాలను అధికంగా తినకండి.. తింటే కిడ్నీ సమస్యలను స్వయంగా ఆహ్వానించినట్లే..

మూత్రపిండాలు మన శరీరంలోని నీరు, వ్యర్థాలను వడపోయడం ద్వారా రక్తంలోని పోషకాలను సమతుల్యం చేస్తాయి. ఇంకా ఈ మూత్రపిండాలు..

Kidney Health: ఈ ఆహారాలను అధికంగా తినకండి.. తింటే కిడ్నీ సమస్యలను స్వయంగా ఆహ్వానించినట్లే..
Kidneys
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 10, 2023 | 5:28 PM

Share

మూత్రపిండాలు మానవ శరీరంలో గుండె తర్వాత రెండవ అతి ముఖ్యమైన అవయవం. శరీరంలోని నీరు, వ్యర్థాలను వడపోయడం ద్వారా రక్తంలోని మినరల్స్, లిక్విడ్స్, ప్రోటీన్స్ వంటి పోషకాలను సమతుల్యం చేస్తాయి. ఇంకా ఈ మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడంలో, ఎముకల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే మన మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తున్నప్పుడు రక్తం నుంచి సోడియం, పొటాషియం, కాల్షియం, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలను కూడా గ్రహించి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. తద్వారా కూడా శరీరంలోని మినరల్స్ స్థాయిని సమతుల్యం చేస్తాయి.

అయితే మూత్రపిండాల ఆరోగ్యం, పనితీరును కాపాడుకోవడానికి కొన్ని రకాల ఆహారాలను అధికంగా తీసుకోకూడదని నిపుణుల సూచన. ముఖ్యంగా ప్రొటీన్లు, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ క్రమంలో ఏయే ఆహారాలను అధికంగా తీసుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ మీట్: రెడ్ మీట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, సమస్యలు నయం కావడానికి కొంత ప్రోటీన్ మాత్రమే అవసరం. అందువల్ల అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం మీ మూత్రపిండాల పనితీరును మరింత దిగజార్చవచ్చు.

ఇవి కూడా చదవండి

వెన్న: వెన్నలో కొవ్వు పుష్కలంగా ఉండడం వల్ల ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం కిడ్నీ వ్యాధికి గుండె జబ్బులు ప్రధాన ప్రమాద కారకం. అందువల్ల ఎక్కువ మొత్తంలో కొవ్వు ఉండే వెన్న వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి కొవ్వు ఉండే పదార్థాలను తక్కువ మొత్తంలో తీసుకోండి.

వేరుశెనగ: వేరుశెనగలో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లలో ఉండే ఒక రకమైన మినరల్. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల నిర్మాణానికి ప్రధాన కారణం. కాబట్టి ఆక్సలేట్‌లను కలిగి ఉన్న ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం చేయడం ద్వారా సమస్యను నిరోధించవచ్చు.

ఉడికించిన కూరగాయలు: కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ.. వాటిలో సాధారణంగా సోడియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఎక్కువ సోడియం ఉండడం వల్ల రక్తం నుంచి అదనపు ద్రవాన్ని తొలగించే పనిలో మూత్రపిండాలకు కష్టతరం అవుతుంది. అందువల్ల వీలైనంతగా ఎక్కువ మొత్తంలో పచ్చి కూరగాయలు తినడాన్ని అలవాటు చేసుకోండి. లేకపోతే ఉడికించిన కూరగాయలను తీసుకోవడాన్ని గణనీయంగా తగ్గించండి.

ప్రాసెస్‌డ్ మీట్: ప్రాసెస్ చేసిన మాంసాలలో గణనీయమైన మొత్తంలో సోడియం, ప్రోటీన్లు ఉంటాయి, ఈ రెండూ మీ కిడ్నీలను అనారోగ్యానికి గురి చేస్తాయి. తాజా మాంసం మాత్రమే తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

అవకాడో: అవకాడోలో ఉండే పొటాషియం.. నరాల, కండరాల పనితీరును నియంత్రిస్తుంది.  పొటాషియం మీ గుండెకు ఎంతో ఉపయోగకరమైనది అయినప్పటికీ.. తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండే అవకాడో వంటి వాటిని తినడం వల్ల హైపర్‌కలేమియా అనే అధునాతన సమస్య బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి లక్షణాలు వికారం, బలహీనత, తిమ్మిరి, హృదయ స్పందన రేటు నెమ్మదించడం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..