AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulletproof Coffee: బుల్లెట్ స్పీడ్‌లో బరువు తగ్గాలా? ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ట్రై చేస్తే నాజూకైన శరీరం మీ సొంతం

బరువు తగ్గడానికి వర్క్ అవుట్స్ చేయడం ఎంత ముఖ్యమో? ఆహార అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ సాకుతో కొత్త కొత్త అలవాట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ వరుసలో ముందుగా వచ్చేది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. అంటే వేడి వేడి కాఫీలో నెయ్యి వేసి చేసుకునే ఈ కాఫీ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని కొందరి అభిప్రాయం.

Bulletproof Coffee: బుల్లెట్ స్పీడ్‌లో బరువు తగ్గాలా? ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ట్రై చేస్తే నాజూకైన శరీరం మీ సొంతం
Bulletproof Coffee
Nikhil
|

Updated on: Mar 10, 2023 | 2:15 PM

Share

మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ వేగంగా బరువు పెరుగుతున్నారు. అయితే అధిక బరువు ఆరోగ్యానికి కూడా నష్టం చేయడంతో అంతా బరువు తగ్గడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నారు. బరువు తగ్గడానికి వర్క్ అవుట్స్ చేయడం ఎంత ముఖ్యమో? ఆహార అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ సాకుతో కొత్త కొత్త అలవాట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ వరుసలో ముందుగా వచ్చేది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. అంటే వేడి వేడి కాఫీలో నెయ్యి వేసి చేసుకునే ఈ కాఫీ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని కొందరి అభిప్రాయం. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఓ కీటో డైట్. ఈ కాఫీ కరోనా మహమ్మారి సమయంలో చాలా ప్రజాధరణ పొందింది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే కార్బోహైడ్రేట్ అల్పాహారాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన పానీయం. ముఖ్యంగా జంక్ ఫుడ్ లేకుండా రోజు గడపడానికి మీకు మరింత శక్తిని ఇస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ శరీరానికి పూర్తి శక్తిని అందిస్తుంది. నెయ్యి జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కాఫీ యొక్క ఉద్దీపన ప్రభావాన్ని పొడిగిస్తుంది. సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఆకలిని నియంత్రించడంతో కీలకపాత్ర పోషిస్తుంది. పోషకాహార నిపుణులు నెయ్యిలో అధిక సంతృప్త కొవ్వు పదార్థాన్ని సూచిస్తున్నప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేసే అనేక సానుకూలతలు ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల జరిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలివే..!

పేగుల ఆరోగ్యం మెరుగు

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తిన్నా ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇందులో ఉండే నెయ్యి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం లేదా జీవక్రియ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ కాఫీని తాగితే చాలా మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ కాఫీని మితంగా తాగాలని మాత్రం సలహా ఇస్తున్నారు.

ఆందోళన తగ్గుదల

కెఫీన్ ఆందోళన స్థాయిలను పెంచుతుంది. అయినప్పటికీ, కొద్దిగా కొవ్వుతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ దీనికి విరుద్ధంగా ఉంటుంది. నెయ్యితో చేసిన కాఫీ మహిళలకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ మెరుగు

నెయ్యి జీర్ణక్రియను నియంత్రిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం మొదలైన ఏవైనా సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. నెయ్యి కాఫీలో కొవ్వు పదార్థం ఉన్నప్పటికీ ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో ఇప్పటికే నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకు అలెర్జీ లేదా లాక్టోస్ అసహనం ఉన్న వ్యక్తులకు కూడా నెయ్యి పానీయం మేలు చేస్తుంది.

తాగాల్సింది ఇప్పుడే..

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలను పొందేందుకు ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో తాగాలి. శరీరానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సాయం చేస్తుంది. ఇది వ్యాయామానికి ముందు గొప్ప ఇంధనంగా కూడా మారుతుంది. అయితే ఈ కాఫీని రెండు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎక్కువసార్లు తాగితే బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. అలాగే నిద్ర విధానాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us