AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి గోలరా బాబు..! ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టి మరీ గొడవ పడుతోంది.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?

రోడ్డు పక్కన ఆపి ఉన్న బైక్‌ను వెనుకగా వచ్చిన ఓ యువతి తన స్కూటీతో ఢీకొట్టింది. ఇంకా బదులుగా ‘గుడ్డివాడివా..? కళ్లు కనిపించడం లేదా..?’ అని బైక్ మీద ఉన్న వ్యక్తిని..

Viral Video: ఇదెక్కడి గోలరా బాబు..! ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టి మరీ గొడవ పడుతోంది.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Young Lady Scolding Biker For Accident
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 10, 2023 | 4:22 PM

రోడ్డు మీద ఆక్సిడెంట్ జరగడం అనేది ఈ రోజుల్లో శరామామూలే అన్నట్లుగా మారిపోయింది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే రోడ్డు పక్కన ఆపి ఉన్న బైక్ లేదా కారును.. ఎవరైనా వచ్చి ఢీకొంటే ఎవరిది తప్పు..? వచ్చి ఢీ కొట్టినవారిదే కదా..? కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. అసలు ఏం జరిగిందంటే రోడ్డు పక్కన ఆపి ఉన్న బైక్‌ను వెనుకగా వచ్చిన ఓ యువతి తన స్కూటీతో ఢీకొట్టింది. ఇంకా బదులుగా ‘గుడ్డివాడివా..? కళ్లు కనిపించడం లేదా..?’ అని బైక్ మీద ఉన్న వ్యక్తిని నిలదీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ కావడంతో ‘ఇదెక్కడి గోలరా దేవుడా..?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘Women ☕☕’ అనే క్యాప్షన్‌తో నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వర్షం కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకును యువతి వచ్చి ఢీకొనడాన్ని మనం చూడవచ్చు. అలాగే ఆమె ‘గుడ్డివాడివా..? కళ్లు కనిపించడంలేదా..? ఎలా నడుపుతున్నావో..?’ అంటూ బైక్ మీద వ్యక్తిపై ఆరవడం మొదలు పెట్టింది. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి.. ‘మేడమ్.. మీరే వచ్చి బైక్‌ను ఢీకొట్టారు’ అన్నందుకు ‘మీరు నాపై అరుస్తున్నారు’ అని బదులిచ్చింది. దీనంతటికీ సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Psycho Bihari (@bihari.broo)

కాగా, bihari.broo అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 42 వేల మంది లైక్ చేశారు. అలాగే వీడియోను చూసిన నెటిజన్లు వింత వింత కామెంట్లతో బైక్ వ్యక్తికి సప్పోర్ట్ పలుకుతున్నారు. మరి కొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. వారిలో ఒక నెటిజన్ అయితే ‘అసలు మీలో ఎవరిదీ కాదు తప్పు.. ఈ వీడియోను చూడడానికి వచ్చిన నాదీ తప్పు’ అని రాసుకొచ్చాడు. అలాగే మరో నెటిజన్ ‘స్క్రిప్ట్ వీడియో అయినా కూడా చూడడానికి చాలా సరదాగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..