Revanth Reddy: కేసీఆర్‌పై ప్రశ్నలు గుప్పించిన రేవంత్.. కవితను ఎందుకు సస్సెండ్ చేయలేదంటూ..

అవినీతి పంపకాల్లో పీఎం మోడీ, సీఎం కేసీఆర్​కు తేడా వచ్చింది. అందుకే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు..

Revanth Reddy: కేసీఆర్‌పై ప్రశ్నలు గుప్పించిన రేవంత్.. కవితను ఎందుకు సస్సెండ్ చేయలేదంటూ..
Revanth Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 11, 2023 | 9:01 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవితపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో జరిగిన సభలో టీపీసీసీ చీఫ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనను సీఎం పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘అయ్య గల్లీలో లిక్కర్ దందా చేస్తే.. బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోంది. అవినీతి పంపకాల్లో పీఎం మోడీ, సీఎం కేసీఆర్​కు తేడా వచ్చింది. అందుకే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేసి దొరికితే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం..? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్​కు.. తెలంగాణకు సంబంధం లేద’న్నారు.

ఇంకా ‘మీ కుటుంబం అక్రమాలకు పాల్పడిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ చెబుతోంది. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే.. మీరంతా గంపగుత్తగా వెళ్లి మోదీకి మద్దతు తెలిపారు. మోదీ సీబీఐ, ఈడీ‌తో ప్రభుత్వాలను పడగొడుతుండని గొంతు చించుకొని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ చీఫ్ సోనియాను అవమానించేందుకు ఈడీ తన ఆఫీసుకు పిలిచినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు. బీఆరెస్, బీజేపీ అవిభక్త కవలలు. ఆనాడు మోదీతో జోడీ కట్టిన మీకు ఇవాళ మేము ఎందుకు మద్దతు ఇస్తాం. అధికారం ఉందని 2018 లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ నన్ను జైల్లో పెట్టి ఎన్నికల్లో నన్ను ఓడించిన ఘనత కేసీఆర్‌ది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..