RCB vs UP-WPL 2023: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆర్‌సీబీ.. దూకుడుగా ఆడుతున్న యూపీ వారియర్స్.. స్కోర్ వివరాలివే..
8 ఓవర్ల సమయానికి ఒకే ఒక్క వికెట్ నష్టానికి 72 పరుగులతో పటిష్టంగా కనిపించింది బెంగళూరు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతీ మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టు తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. యూపీ వారియర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు పేకమేడలా కుప్పకూలిపోయారు. 8 ఓవర్ల సమయానికి ఒకే ఒక్క వికెట్ నష్టానికి 72 పరుగులతో పటిష్టంగా కనిపించింది బెంగళూరు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక బెంగళూరు బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ (52: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసింది. అయితే టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన. కానీ జట్టుకు కోరుకున్న స్థాయిలో శుభారంభం లభించలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది.
Innings Break!
ఇవి కూడా చదవండిAn impressive bowling performance from @UPWarriorz! ? ?
4⃣ wickets for @Sophecc19 3⃣ wickets for @Deepti_Sharma06 @EllysePerry top scores for @RCBTweets ? ?
The #UPW chase is coming up shortly!
Scorecard ▶️ https://t.co/aLy7IOKGXp#TATAWPL | #RCBvUPW pic.twitter.com/rtcbmavjPv
— Women’s Premier League (WPL) (@wplt20) March 10, 2023
మరో ఓపెనర్ సోఫీ డివైన్, వన్ బౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో జోరు మీదున్న సోఫీ డివైన్‌ను పెవిలియన్ బాట పట్టించి.. బెంగళూరును ఎకిల్ స్టోన్ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. కేవలం 65 పరుగుల వ్యవధిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లను కోల్పోయింది. దీంతో 19.3 ఓవర్ల ఆటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 138 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 4 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.
కాగా, 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అలిస్సా హీలీ, దేవిక వైద్య జంట వికెట్ పడకుండా రాణిస్తున్నారు. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ(33 బంతుల్లో 66 పరుగులు; 14 ఫోర్లు)(21 బంతుల్లో 26 పరుగులు; 4 ఫోర్లు) వికెట్ నష్టపోకుండానే ఆర్‌సీబీ విసిరిన టార్గెట్‌ను ఛేదించేలా కనిపిస్తున్నారు.
ఆర్‌సీబీ: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్
యూపీ: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్