WPL 2023: ఫీల్డింగ్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు కూల్‌ డ్రింక్స్ పంచిన టీమిండియా క్రికెటర్‌.. ఫిదా అవుతోన్న అభిమానులు

మహిళల క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ నెల 4న ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. అంచనాలకు తగ్గట్టుగానే క్రికెట్‌ అభిమానులకు మంచి వినోదం అందిస్తోంది మెగా క్రికెట్‌ లీగ్‌.

WPL 2023: ఫీల్డింగ్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు కూల్‌ డ్రింక్స్ పంచిన టీమిండియా క్రికెటర్‌.. ఫిదా అవుతోన్న అభిమానులు
Jemimah Rodrigues
Follow us
Basha Shek

|

Updated on: Mar 10, 2023 | 9:32 PM

మహిళల క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ నెల 4న ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. అంచనాలకు తగ్గట్టుగానే క్రికెట్‌ అభిమానులకు మంచి వినోదం అందిస్తోంది మెగా క్రికెట్‌ లీగ్‌. లీగ్‌లో భాగంగా గురువారం (మార్చి 9) ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా అందరి మనసులు గెల్చుకుంది ఢిల్లీ జట్టు స్టార్‌ ప్లేయర్‌ జెమీమీ రోడ్రిగ్స్. ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి ఔటైంది రోడ్రిగ్స్‌. అయితే ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జెమీమీ చేసిన ఒక పని అందరినీ ఆకట్టుకుంది. అదేంటంటే.. బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తోన్న జెమీమా గ్యాలరీలోని ఫ్యాన్స్‌కు తన కూల్‌ డ్రింక్స్‌ను పంచింది. స్టార్‌ ప్లేయర్‌ అన్న హోదాను పక్కన పెట్టి రోడ్రిగ్స్‌ ఇలా అందరికీ కూల్‌ డ్రింక్స్‌ పంచడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్‌లో ఆటతో పాటు తన డ్యాన్స్‌తోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది జెమీమా. బెంగళూర్‌తో మధ్య మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ సమయంలో రోడ్రిగ్స్‌ వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు మొదటి మ్యాచ్ సందర్భంగా తన గ్రాండ్ పేరెంట్స్ తో ఫొటోలు దిగి వార్తల్లో నిలిచింది. ఇలా మొత్తానికి ఏదో ఒకటి చేస్తూ కెమెరాను తనవైపునకు తిప్పుకుంటుందీ స్టార్ బ్యాటర్‌. కాగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండింటిలో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో జెమీమా జట్టు ఇప్పుడు మూడో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..