AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: అర్ధరాత్రి నడిరోడ్డుపై అమ్మాయిని వేధించిన పోలీస్‌.. నా రక్తం మరిగిపోతుందంటూ మంచు లక్ష్మీ మండిపాటు

నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ. మంచు మోహన్‌బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Manchu Lakshmi: అర్ధరాత్రి నడిరోడ్డుపై అమ్మాయిని వేధించిన పోలీస్‌.. నా రక్తం మరిగిపోతుందంటూ మంచు లక్ష్మీ మండిపాటు
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Mar 09, 2023 | 5:49 PM

Share

నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ. మంచు మోహన్‌బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోల్లో పాల్గొంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే మంచు లక్ష్మీకి సామాజిక దృక్పథం కాస్త ఎక్కువే. సామాజిక సమస్యలతో పాటు మహిళల సమస్యలపై తరచూ తన గళం వినిపిస్తుంటుంది. తాజాగా ఆమె ఓ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నా రక్తం మరిగిపోతుందంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించాడు పోలీస్‌. కంచె చేను మేసినట్లు రక్షించాల్సిన రక్షక భటుడే అమ్మాయిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది.

ఈ సంఘటనను కొందరు వ్యక్తులు ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ ట్వీట్‌ చేసింది. ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగడితే సాయం చేయమని ఇంకెవరిని అడుగుతాం? అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వీడియో తీసినవాళ్లు పోలీస్‌ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుండేదని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..