AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దటీజ్‌ యంగ్‌ టైగర్‌.. అభిమాని తల్లితో ఆప్యాయంగా మాట్లాడిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. వైరల్ వీడియో

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ తన ఫ్యాన్స్‌ గురించి తప్పక ప్రస్తావిస్తుంటారు తారక్‌.

Viral Video: దటీజ్‌ యంగ్‌ టైగర్‌.. అభిమాని తల్లితో ఆప్యాయంగా మాట్లాడిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. వైరల్ వీడియో
Jr Ntr
Basha Shek
|

Updated on: Mar 08, 2023 | 8:54 PM

Share

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ తన ఫ్యాన్స్‌ గురించి తప్పక ప్రస్తావిస్తుంటారు తారక్‌. అభిమానుల క్షేమాన్ని ఆకాంక్షించే వారిలో ఆయన ముందుంటాడు. తాజాగా అమెరికా నడి వీధుల్లోనూ తన అభిమానుల గురించి చెబుతూ ఎమోషనలయ్యాడు స్టార్‌ హీరో. మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. దానికి రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది. కానీ దానిని చూపించలేకపోతున్నా. మనది రక్త సంబంధం కంటే గొప్పది. మీరంతా నాకు సోదరులతో సమానం’ అంటూ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు తారక్‌. తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు తారక్‌. వివరాల్లోకి వెళితే.. ఆస్కా్‌ర్‌ ప్రమోషన్స్‌ కోసం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నాడు ఎన్టీఆర్‌. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో లాస్ ఎంజెల్స్‌లో ఉంటున్నారు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో తారక్‌ పాల్గొననున్నారు. కాగా అమెరికాలో బిజిబిజీగా ఉంటోన్న ఎన్టీఆర్‌ తాజాగా అభిమానులు ఏర్పాటుచేసిన ఓ ఫ్యాన్స్‌మీట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడున్న అభిమానులందరితో ఎంతో ఓపికగా ఫొటోలు దిగాడు.

ఈ కార్యక్రమంలో ఓ అభిమాని తారక్‌ను ఓ రిక్వెస్ట్ చేశాడు. ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఒక్కసారి ఆమెతో మాట్లాడతారా? అని అడిగిన వెంటనే ఓకే చెప్పారు. దీంతో ఆ అభిమాని తన తల్లికి వీడియో కాల్‌ చేయగా ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ఓ కుటుంబసభ్యుడిలా మాట్లాడారు. ‘ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా’ అని పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన తారక్‌ అభిమానులు ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ‘దటీజ్‌ యంగ్‌ టైగర్‌’ అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు షేర్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్