AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: గుండెపోటు విషయంలో ఆ పొరపాటు అసలు చేయద్దు.. మహిళలకు నటి సుస్మితా సేన్‌ సలహా

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరిగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కార్డియాక్‌ అరెస్ట్‌కు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో హార్ట్‌ అటాక్‌కు లోనై ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలవరపెడుతోంది.

Sushmita Sen: గుండెపోటు విషయంలో ఆ పొరపాటు అసలు చేయద్దు.. మహిళలకు నటి సుస్మితా సేన్‌ సలహా
Sushmita Sen
Basha Shek
|

Updated on: Mar 08, 2023 | 9:31 PM

Share

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరిగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కార్డియాక్‌ అరెస్ట్‌కు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో హార్ట్‌ అటాక్‌కు లోనై ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలవరపెడుతోంది. ఇలా గుండెపోటు బాధితుల జాబితాలో సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్‌ ప్రముఖ నటి సుస్మితా సేన్‌ కూడా గుండెపోటు బారిన పడింది. అయితే కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారని, యాంజియో ప్లాస్టీ, స్టెంట్‌ వేయడంతో ప్రాణాపాయం నుంచి కోలుకున్నానని స్వయంగా సుస్మిత చెప్పడం అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. ఎందుకంటే సుస్మిత వయసు ప్రస్తుతం 47 ఏళ్లు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె చాలా ఫిట్‌గా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యమిస్తూ నిత్యం జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంది. డైట్‌ ప్లాన్‌ కూడా కచ్చితంగ ఫాలో అవుతోంది. దీనికి తోడు మహిళల్లో గుండెపోటు సమస్యలు తక్కువ అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇలా అన్ని లెక్కలను బేరీజు వేసుకుంటే సుస్మితకు గుండెపోటు వచ్చిందంటే ఆశ్చర్యకర విషయమే. అయితే జిమ్‌లో వర్కవుట్లు ఎక్కువగా చేయడం వల్లనే ఆమెకు గుండెపోటు వచ్చిందని చాలామంది భావించారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటోంది సుస్మిత. తన ఫిట్‌నెస్‌ వల్లే తాను బతికి బయటపడ్డానంటోంది. ‘నాకు గుండెపోటు వచ్చిన సమయంలో రక్తనాళాలు మూసుకు పోయిన మాట వాస్తవమే కానీ నిత్యం ఎక్సర్ సైజ్ చేయడం వల్లే స్టెంట్‌తో సరిపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం రన్నింగో, వాకింగో, యోగానో, ఏదో ఒక వ్యాయామం చెయ్యాలి. మహిళలు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి’

‘ఇక చాలామంది, ఎప్పుడూ ఎక్సర్ సైజ్ చేసే సుస్మితకే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇక జిమ్‌కి ఎందుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నారు కానీ అది తప్పు. నేను ఫిట్ గా ఉండడం వల్లే తొందరగా కోలుకున్నాను. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న అందరూ ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఇలా ముందస్తు ఈ చెకప్లు చేయించడం వలన ముందే సమస్యని పసిగట్టే అవకాశం ఉంది’ అని సూచనలిచ్చింది సుస్మిత. కాగా 1994లో విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న సుస్మిత.. తర్వాత హిందీతోపాటు తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన రక్షకుడు సినిమాలో నటించింది. అలాగే అర్జున్‌ ఒకే ఒక్కడు సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"