Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: వారికి పెళ్లంటే భయం.. శృంగారమంటే బద్ధకం.. షాకింగ్ కామెంట్స్‌ చేసిన బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌

కంగనా రనౌత్‌.. ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న ఈ అందాల తార ఏ విషయం గురించైనా కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. నిత్యం ఏదో ఒక విషయంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తుందీ బోల్డ్‌ బ్యూటీ.

Kangana Ranaut: వారికి పెళ్లంటే భయం.. శృంగారమంటే బద్ధకం.. షాకింగ్ కామెంట్స్‌ చేసిన బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌
Kangana Ranaut
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2023 | 1:02 PM

కంగనా రనౌత్‌.. ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న ఈ అందాల తార ఏ విషయం గురించైనా కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. నిత్యం ఏదో ఒక విషయంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తుందీ బోల్డ్‌ బ్యూటీ. కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ ముద్దుగుమ్మ తాజాగా జనరేషన్‌ Z (1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారు) పై ఆసక్తికర కామెంట్లు చేసింది. యువకులు మిలిటరీకి అనర్హులంటూ ఒక అమెరికన్‌ పోస్టుపై స్పందిస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది కంగన . ‘1997 నుంచి 2012 మధ్య పుట్టిన జనరేషన్ అంతా స్మార్ట్‌ఫోన్లకు బాగా బానిసలు అయ్యారు. వీరి చేతులు, కాళ్లు కర్రల మాదిరిగా ఉంటాయి. ఒకరితో ఇంటరాక్ట్ కావడం, చదవడం కంటే కూడా ఎక్కువ సమయం ఫోన్‌లలోనే గడుపుతారు. ఆఫీస్‌లో బాస్‌ను గౌరవించరు కానీ ఆ పొజిషన్ తమకు కావాలనుకుంటారు. స్టార్‌బక్స్, అవోకాడో టోస్ట్‌లను ఇష్టపడతారు కానీ సొంతగా ఇల్లు కొనుక్కునే స్థోమత కూడా ఉండదు. ఇతరులను అట్రాక్ట్ చేసేందుకు బ్రాండెడ్ దుస్తులు రెంట్‌కు తీసుకుంటారు కానీ కమిట్‌మెంట్ లేదా పెళ్లిని ద్వేషిస్తారు. వీరు శృంగార విషయంలో కూడా బద్దకాన్ని చూపెడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. డబ్బులు లేవని కమిట్ మెంట్ తో పాటుగా వివాహం చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇక శృంగార విషయంలో బద్దకాన్ని చూపెడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి’

‘ఇక ఈ జనరేషన్ లో పుట్టిన వారి మనసులు స్థిరంగా ఉండవని, వారికి క్రమ శిక్షణతో ఎదిగిన వారంటే ఇష్టముండదు. ఇలాంటి వారు షార్ట్స్ కట్స్ తో విజయం సాధించిన వారినే హీరోలుగా చూస్తారు. వీరితో పోల్చుకుంటే మిలియనీల్స్‌ (1981-96 మధ్య పుట్టిన వారు) చాలా బెటర్‌. అన్ని రంగాల్లో ప్రపంచాన్ని ఏలుతున్నారు’ అని పోస్ట్‌లో పేర్కొంది కంగనా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది కంగనా. అలాగే తేజాస్‌, టికు వెడ్స్‌ షెరు, ఎమర్జెన్సీ తదితర ప్రాజెక్టులోనూ యాక్ట్‌ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి
Kangana Ranaut Post

Kangana Ranaut Post

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..