Bhumi Pednekar: అందరి ముందు అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న స్టార్‌ హీరోయిన్‌.. మండిపడుతున్న నెటిజన్లు

సినిమాల్లో తప్ప బయటి విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపని ఆమె ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో నిలిచింది లేదు. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌కు గురవుతోంది భూమి పెడ్నేకర్‌. నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు.

Bhumi Pednekar: అందరి ముందు అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న స్టార్‌ హీరోయిన్‌.. మండిపడుతున్న నెటిజన్లు
Bhumi Pednekar
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2023 | 11:31 AM

బాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది భూమి పెడ్నకర్‌. ఓవైపు గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తోందీ అందాల తార. దమ్‌ లగా కే హైసా, టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ, శుభ్‌మంగళ్‌ సావధాన్‌, సాంచారియా, సాండ్‌ కీ ఆంఖ్‌, బాలా, పతీ పత్నీ ఔర్‌ ఓ, దుర్గామతి, బదాయి హో, రక్షాబంధన్‌ వంటి హిట్‌ సినిమాలు భూమి ఖాతాలో ఉన్నాయి. సినిమాల్లో తప్ప బయటి విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపని ఆమె ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో నిలిచింది లేదు. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌కు గురవుతోంది భూమి పెడ్నేకర్‌. నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఓ ఈవెంట్‌కు వెళ్లిన భూమి తన అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకోవడమే ఈ వివాదానికి కారణం. వివరాల్లోకి వెళితే..

భూమి పడ్నేకర్‌ తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా స్టేజ్‌ ఎక్కారు. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్‌పై రావాలని అతిథులు పిలిచారు. దీంతో ఆమె చెప్పులు విప్పి పైకి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోయింది. దీంతో పక్కకు వచ్చి తన అసిస్టెంట్‌కు సైగ చేసింది. వెంటనే అతను వచ్చి ఆమెకు సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్‌ పైకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాతో భూమిపెడ్నేకర్‌ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్