Kiara Advani: బిగ్ న్యూస్ చెప్తానని సడన్ ట్విస్ట్ ఇచ్చిన కియారా.. అదే అయ్యుంటుందా..?
అతికొద్ది మంది సన్నిహితులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షేర్షా సినిమాతో తెరపై మాయ చేసిన ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఇప్పుడు నిజజీవితంలో దంపతులుగా మారారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఇటీవలే వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షేర్షా సినిమాతో తెరపై మాయ చేసిన ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఇప్పుడు నిజజీవితంలో దంపతులుగా మారారు. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు విదేశాల్లో విహారాలు చేస్తున్నారు. అలాగే ఈ ఇద్దరు తమ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కియారా అద్వానీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఫోటోలకు అమ్మడు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా కియారా పోస్ట్ చేసిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలోషేర్ చేసింది. కియారా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. మీకు త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతానంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె చేతిలో ప్లేట్ పట్టుకొని ఉంది.
ఆ ప్లేట్ నిండా మామిడి ముక్కలు ఉండటంతో ఇప్పుడు ఆమె అభిమానులంతా కియారా తల్లికాబోతుందని అంటున్నారు. పెళ్లి తర్వాత బిగ్ న్యూస్ అని పోస్ట్ పెడితే అది ఖచ్చితంగా తన ప్రెగ్నెన్సీ విషయమే అయ్యుంటుందని గుసగుసలాడుతున్నారు అంతా..? మరి ఆ బిగ్ న్యూస్ ఏంటో కియారనే చెప్పాలి.Kiara