AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Lasya: పండగ పూట పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ యాంకర్‌.. లాస్యకు సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్ స్టార్‌ యాంకర్‌ లాస్య మరోసారి తల్లిగా ప్రమోషన్‌ పొందింది. హోలీ పండగ రోజున ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను లాస్యే సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుని మురిసిపోయింది.

Anchor Lasya: పండగ పూట పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ యాంకర్‌.. లాస్యకు సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ
Anchor Lasya
Basha Shek
|

Updated on: Mar 08, 2023 | 8:19 PM

Share

టాలీవుడ్ స్టార్‌ యాంకర్‌ లాస్య మరోసారి తల్లిగా ప్రమోషన్‌ పొందింది. హోలీ పండగ రోజున ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను లాస్యే సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుని మురిసిపోయింది. హోలీ సందర్భాన్ని పురస్కరించుకుని చేతులకు రంగులు అద్దుకుని ‘ఇట్స్ ఏ బేబీ బాయ్’ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లాస్యకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్‌, నటి సిరి హన్మంత్ కంగ్రాట్స్ చెప్పగా.. మరో యాంకర్ స్రవంతి చొక్కారపు తదితరులు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చింది లాస్య. తాజాగా మరోసారి తల్లిదండ్రులు కావడంతో లాస్య– మంజునాథ్‌ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

కాగా మాటల గారడీతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య. తనదైన కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందామె. ముఖ్యంగా ఆమె ఏనుగు-చీమ జోక్స్‌కు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ తర్వాత యాంకర్‌ రవితో చేసిన షోలు బాగా ఆదరణ పొందాయి. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక టీవీ షోలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. నిత్యం తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకుంటుంది. అలాగే తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించింది లాస్య. ఇప్పుడు పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం చిన్నారి, తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..