Umesh Yadav: తండ్రైన టీమిండియా క్రికెటర్.. మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ పుట్టిందంటూ..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య తాన్య వధ్వా బుధవారం (మార్చి 8) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్‌నే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య తాన్య వధ్వా బుధవారం (మార్చి 8) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్‌నే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఇట్స్ ఏ బేబీ గర్ల్’.. మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మి అడుగుపెట్టింది. మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు ఉమేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ఉమేశ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్‌గా సేవలందిస్తోన్న ఉమేశ్ 2013 మే 29న పంజాబ్‌కు చెందిన తాన్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ ప్రేమ బంధానికి గుర్తింపుగా 2021 జనవరి 1న ఆడ బిడ్డ వీరి ఇంట్లోకి అడుగుపెట్టింది. తాజాగా రెండోసారి తాన్య పాపకే జన్మనిచ్చింది. దీంతో ఉమేశ్ ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోంది.
కాగా కొన్ని రోజుల క్రితం ఉమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తండ్రి తిలక్ యాదవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.దీంతో ఆసీస్‌తో మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేశ్. తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా స్వదేశంలో 100 వికెట్లు పడగొట్టిన 5వ పేసర్‌గా రికార్డుల కెక్కాడు. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి టెస్టు గురువారం (మార్చి 9) నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు తప్పనిసరి.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..