Telangana: పిచ్చి తల్లి.. ప్రాణాపాయంలోకి నెట్టిన పతిని కూడా కాపాడాలనుకుంది.. కానీ చివరకు..

పిల్లల కళ్లెదుటే భార్యపై ఓ క్యాన్‌తో శానిటైజర్‌ చల్లాడు భర్త. అడ్డుకోబోయిన పిల్లలపై కూడా శానిటైజర్‌ గుమ్మరించబోయాడు.. భార్య ప్రతిఘటించింది. అంతే సడెన్‌గా అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు

Telangana: పిచ్చి తల్లి.. ప్రాణాపాయంలోకి నెట్టిన పతిని కూడా కాపాడాలనుకుంది.. కానీ చివరకు..
Medchal Crime
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 10:46 AM

పిల్లల కళ్లెదుటే భార్యపై ఓ క్యాన్‌తో శానిటైజర్‌ చల్లాడు భర్త. అడ్డుకోబోయిన పిల్లలపై కూడా శానిటైజర్‌ గుమ్మరించబోయాడు.. భార్య ప్రతిఘటించింది. అంతే సడెన్‌గా అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు ఎగిశాయి. అక్కడే ఉన్న పిల్లలు.. ఇరుగుపొరుగు మంటలను ఆర్పబోయారు. కానీ ఆమె కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. 20 రోజులుగా మృత్యువుతో పోరాడిన నవ్య.. చివరకు కన్నుమూశారు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముందుగా నవ్య ఆత్మహత్యాయత్నం చేసిందనుకున్నారంతా. కానీ నిప్పు వెనుక నిజం ఏంటో పిల్లల ఫిర్యాదుతో తెరపైకి వచ్చింది. నిజం బయటకు రాకుండా పోలీసులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చాడు భర్త తిరునగర్‌ నాగేందర్‌. దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకున్నాయని చెప్పాడు. భర్తకు శిక్ష పడితే పిల్లల పరిస్థితి ఏమవుతుందనుకుందో ఏమో కానీ నవ్య కూడా అలానే వాంగ్మూలం ఇచ్చింది. ఆ మేరకు పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. చికిత్స కోసం నవ్యను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. తీవ్ర గాయాలతో ఈ నెల 5న నవ్య చనిపోయారు. నిప్పు వెనుక అసలు నిజం ఏంటో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు పిల్లలు. నాన్నే అమ్మను చంపేశాడని చెప్పారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తే ఇలా షాకింగ్‌ నిజాలు తెరపైకి వచ్చాయి. నిందితుడు నాగేందర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మద్యం మైకమా? శాడిజమా? శానిటైజర్‌తో భార్యను చంపేశాడు? బిడ్డల్ని అనాథల్ని చేశాడు. కానీ ప్రాణంపోతుందని తెలిసి కూడా భర్తను పల్లెత్తుమాట అనలేదు నవ్య. అతనికి శిక్ష పడితే పిల్లల భవిష్యత్‌ ఏమైపోతుందననే బాధను భరించింది.

కాగా నవ్యశ్రీ మృతి చెందడంతో ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి నరేంద్రపై ఫిర్యాదు చేసింది. తన తల్లి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోలేదని, తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా శానిటైజర్‌ చల్లి నిప్పంటించాడని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నామని తండ్రికి వద్దని ఎంత చెప్పినా వినలేదని శానిటైజర్‌ను అమ్మపై చల్లి నిప్పుపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్ పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..