AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో 48 గంటల పాటు.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఇందులో మీ కాలనీ ఉందో చూసుకోండి..

రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ - 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్‌కు..

Hyderabad: హైదరాబాద్‌లో 48 గంటల పాటు.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఇందులో మీ కాలనీ ఉందో చూసుకోండి..
Water Supply
Sanjay Kasula
|

Updated on: Mar 08, 2023 | 8:20 PM

Share

రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్ కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పైప్‌ లైన్‌ పనుల నేపథ్యంలో నగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి, మార్చి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు పనులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

పూర్తిగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.
  2. ఓ అండ్ ఎం డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.
  3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.
  4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.
  5. ఓ అండ్ ఎం డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు. ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.
  6. ఓ అండ్ ఎం డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.

పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
  2. ఓ అండ్ ఎం డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.
  3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.
  4.  ఓ అండ్ ఎం డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..