Hyderabad: ఫేక్‌ సర్టిఫికెట్ల ఇష్యూలో అధికారులపై వేటు.. కీలక నిర్ణయం తీసుకున్న GHMC మేయర్‌ విజయలక్ష్మి

బర్త్‌, డెత్‌ ఫేక్‌ సర్టిఫికెట్ల బాగోతంలో పరువు మొత్తం హుస్సేన్‌సాగర్‌లో కలిశాక నష్టనివారణ చేపట్టింది బల్దియా. నలుగురు అధికారులపై బదిలీ వేటు వేశారు. 15 మీసేవా కేంద్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు.

Hyderabad: ఫేక్‌ సర్టిఫికెట్ల ఇష్యూలో అధికారులపై వేటు.. కీలక నిర్ణయం తీసుకున్న GHMC మేయర్‌ విజయలక్ష్మి
Ghmc Mayor Gadwal Vijayalakshmi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 08, 2023 | 7:24 PM

ఫేక్‌ సర్టిఫికెట్ల ఇష్యూలో సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తప్పవంటూ రెండున్నర గంటలు అత్యవసర సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి. హెల్త్‌ విభాగంలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌పై బదిలీ వేటు వేశారు. గణాంక విభాగంలో పనిచేసే ASO, DSOను సొంత డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. బర్త్, డెత్‌ సర్టిఫికెట్లు జారీ చేసే కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ముఖ్యంగా CMOH.. ఇంటర్వ్యూలు చేయకూడదు.. కానీ చేశారు. రోస్టర్‌ విధానం పాటించలేదు. ఇలా ఎందుకు చేశారంటూ CMOHపై మేయర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరోవైపు.. 15 మీసేవా కేంద్రాల ద్వారా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. వారిపై మీసేవా విభాగంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ నిర్ణయించారు. ఫేక్‌ సర్టిఫికెట్ల జారీ వెనుక ఉగ్రకోణం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. మీసేవా కేంద్రాలపైకి స్కాం నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తోంది. పల్లపు గోవర్దన్‌ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు బల్దియా ఆఫీస్ ముందు ఆందోళన చేశారు.

ఈ ఇష్యూలో పురపాలక మంత్రి కేటీఆర్‌ను ఎందుకు పదవి నుంచి తప్పించలేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే.. సీఎం కేసీఆర్ యాక్షన్‌ మరోలా ఉండేదని సైటెర్లు వేశారాయన.

మీసేవా కేంద్రాలకు డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వడంతో.. నేరుగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని ఓ నిర్ణయానికి వచ్చారు. తాము ఎలాంటి వెరిఫికేషన్ చేయట్లేదని AMOH అధికారులు చెప్పారు. RDO ప్రొసీడింగ్స్ లేకుండా అప్రూవ్ అయిన 21 వేల సర్టిఫికెట్లు మాత్రమే రద్దు చేసినట్టు కమిషనర్‌ లోకేష్‌ మాట. వారికి మెసేజ్‌ ఇస్తామని.. సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేస్తే తిరిగి సర్టిఫికెట్‌ జారీ చేస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం