OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగే.. రేపు ఒక్కరోజే రిలీజ్‌కానున్న 26 సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు.. ఫుల్ లిస్టు ఇదిగో

వారం వారం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ప్రస్తుతం చాలామంది దృష్టి ఓటీటీలపైనే ఉంది. ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి? వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి? అన్న విషయాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు.

OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగే.. రేపు ఒక్కరోజే రిలీజ్‌కానున్న 26 సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు.. ఫుల్ లిస్టు ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 3:54 PM

వారం వారం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ప్రస్తుతం చాలామంది దృష్టి ఓటీటీలపైనే ఉంది. ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి? వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి? అన్న విషయాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే వివిధ ఓటీటీలు కూడా ప్రేక్షకులకు ఆసక్తికరమైన కంటెంట్‌ను అందించడానికి పోటీ పడుతున్నాయి. మూవీ మేకర్స్‌ లో కూడా చాలామంది డైరెక్ట్‌ ఓటీటీ రిలీజులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం రిలీజవుతోన్న రామానాయుడు వెబ్‌సిరీస్‌ ఈ కోవకే చెందుతుంది. దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేశ్‌ లాంటి స్టార్‌ హీరోలు డిజిటల్‌ కంటెంట్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారంటే ఓటీటీల క్రేజ్‌ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అందుకే వారం వారం పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. అలా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. శుక్రవారం (మార్చి 10)న ఓటీటీల్లో సుమారు 26 సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • యాంగర్ టేల్స్ – తెలుగు సిరీస్
  • రన్ బేబీ రన్ – తెలుగు, తమిళ్‌
  • చాంగ్ కెన్ డంక్ – ఇంగ్లిష్ మూవీ

అమెజాన్ ప్రైమ్:

ఇవి కూడా చదవండి
  • క్రిస్టోఫర్ – తెలుగు/మలయాళం
  • వారయన్ – మలయాళం
  • దాదా – తమిళ్‌
  • వారిసు – హిందీ
  • హ్యాపీ ఫ్యామిలీ:కండిషన్స్ అప్లై – హిందీ సిరీస్

నెట్ ఫ్లిక్స్:

  • రానా నాయుడు – తెలుగు/హిందీ సిరీస్రేఖ – మలయాళం
  • లూథర్ ది ఫాలెన్ సన్ – ఇంగ్లిష్
  • ది గ్లోరీ – కొరియన్ సిరీస్‌
  • అవుట్ లాస్ట్ – ఇంగ్లిష్ సిరీస్‌
  • యూ – హిందీ/ఇంగ్లిష్ సిరీస్ 4
  • MH370; ది ప్లేన్ దట్ డిసప్పియర్డ్ – ఇంగ్లిష్ డాక్యుమెంటరీ
  • హ్యావ్‌ ఏ నైస్ డే – మెక్సికన్

సోనీ లివ్:

  • నిజం విత్ స్మిత – సాయిపల్లవి ఎపిసోడ్
  • బ్యాడ్ ట్రిప్ – తెలుగు సిరీస్
  • క్రిస్టీ – మలయాళం
  • యాక్సిడెంటల్ ఫార్మర్ & కో తమిళ్‌ సిరీస్

జీ5:

  • రేమో – కన్నడ
  • బొమ్మై నాయగి – తమిళం
  • మిడిల్ క్లాస్ లవ్ – హిందీ
  • బౌడి క్యాంటీన్ – బెంగాలీ

సైనా ప్లే

  • చతురం – మలయాళం

సింప్లీ సౌత్

  • కన్నితీవు – తమిళం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.