AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ముగ్గురిలో ఎవరితో డ్యాన్ చేస్తావ్ ?.. సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..

ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తోన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. కంటెంట్.. పాత్ర నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే స్టార్ హీరో సినిమా అయినా సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది.

Sai Pallavi: రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ముగ్గురిలో ఎవరితో డ్యాన్ చేస్తావ్ ?.. సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2023 | 3:13 PM

Share

డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది హీరోయిన్ సాయి పల్లవి. తొలి చిత్రంంతోనే నటనతో.. అందంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ… ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తోన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. కంటెంట్.. పాత్ర నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే స్టార్ హీరో సినిమా అయినా సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇటీవలే తెలుగులో విరాట పర్వం, గార్గి చిత్రాలతో నటించిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో సినిమాలకు సాయి పల్లవి దూరం కాబోతుందనే టాక్ నడిస్తోంది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొంది. ఇందులో తన కెరీర్.. తన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు.. సినీ విశేషాలను పంచుకున్నారు సాయి పల్లవి. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ముగ్దురిలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు ? అని ప్రశ్నించగా.. ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

అలాగే సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన మీటూ ఉద్యమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వేధింపులు అంటే కేవలం శారీరకంగానే కాదని.. మానసికంగానూ ఉంటుందని తెలిపింది. శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు.. కానీ మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానం అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్