AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: అంచనాలు పెంచేస్తోన్న అర్జున్ రెడ్డి సీక్వెల్.. అప్ డేట్ కావాలంటోన్న విజయ్ ఫ్యాన్స్

డైరెక్టర్ సందీప్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు సందీప్ రెడ్డి.

Vijay Deverakonda: అంచనాలు పెంచేస్తోన్న అర్జున్ రెడ్డి సీక్వెల్.. అప్ డేట్ కావాలంటోన్న విజయ్ ఫ్యాన్స్
Arjun Reddy
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2023 | 1:41 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన చిత్రాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో వీరిద్దరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ అందుకున్నారు. ఈ చిత్రంలో నటనకు ప్రశంసలు అందుకున్నారు విజయ్. ఇందులో కథానాయికగా షాలిని పాండే నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత గీతా గోవిందం, డియర్ కామెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో అలరించిన విజయ్..ఇటీవలే లైగర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు విజయ్.

మరోవైపు డైరెక్టర్ సందీప్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు సందీప్ రెడ్డి. అయితే సినీ ప్రియులు మాత్రం అర్జున్ రెడ్డి సిక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటుంది. తాజాగా అర్జున్ రెడ్డి సిక్వెల్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. హీరో విజయ్ దేవరకొండకు స్క్రిప్ట్ వినిపించారని.. ఇందుకు రౌడీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్ సినిమా తర్వాత వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని.. అర్జున్ రెడ్డికి మించి ఈ చిత్రం సిక్వెల్ ఉండబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సిక్వెల్ అర్జున్ రెడ్డి చిత్రానికి రెండో భాగం కాదట.. పూర్తిగా కొత్త కథాంశంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీంతో అర్జున్ రెడ్డి సిక్వెల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సూపర్ హిట్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ అర్జున్ రెడ్డి సిక్వెల్ పై చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజమేంతో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్