Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: ఇండిగో స్టాఫ్ తీరుపై మంచు లక్ష్మి అసహనం.. 103 డిగ్రీల జ్వరంలో..

నా పర్స్ మర్చిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీపట్ల మంచిగా ఉంటే పని కాదు. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా ?

Manchu Lakshmi: ఇండిగో స్టాఫ్ తీరుపై మంచు లక్ష్మి అసహనం.. 103 డిగ్రీల జ్వరంలో..
Manchu Lakshmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2023 | 11:27 AM

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్టార్ తీరుపై నటి మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్‏కు ఇండిగో విమానంలో వచ్చిన లక్ష్మి.. తాను ప్రయాణించిన సమయం కంటే తనకు ఎయిర్ పోర్టులో సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది తీసుకున్న సమయమే ఎక్కువ అంటూ చురకలంటించారు. ఈ మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ ను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. “నా పర్స్ మర్చిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీపట్ల మంచిగా ఉంటే పని కాదు. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా ? ” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది మంచు లక్ష్మి. అయితే ఇందులో ఇండిగో ట్విట్టర్ అకౌంట్ కాకుండా.. మరో అకౌంట్ ట్యాగ్ చేశారు.

అనంతరం మరో ట్వీ్ట్‏లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను కరెక్ట్ గా ట్యాగ్ చేస్తూ.. “ఇండిగో సిబ్బంది ఎయిర్ పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కన్నా.. త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే్శాను. కానీ వాళ్లు క్షణాల్లో కనుమరుగైపోయారు. 103 డిగ్రీల జ్వరం కూడా ఎలాంటి సాయం చేయలేదు. ఇండిగో..దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా ? ” అంటూ పేర్కొన్నారు. మంచు లక్ష్మి చేసిన ట్వీ్ట్స్ పై ఇండిగో సంస్థ స్పందించింది.

ఇవి కూడా చదవండి

‘హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మా మేనేజర్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు మేడమ్. విమానంలో మీరు మర్చిపోయిన బ్యాగ్ ను తిరిగి మీకు మా సిబ్బంది అందచేశారని తెలుసుకున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మరోసారి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి’ అంటూ వివరణ ఇచ్చింది ఇండిగో.. అయితే ఇండిగో సంస్థ వివరణకు మంచు లక్ష్మి స్పందిస్తూ.. బ్యాన్ ఇండిగో అంటూ హ్యాగ్ ట్యాగ్ జతచేసింది.ఇక ఇండిగో సంస్థ తీరుపై సామాన్యులు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.