Venkatesh Maha: భాష తప్పేమో.. భావం అయితే తప్పు కాదు.. వివాదంపై స్పందించిన డైరెక్టర్ వెంకటేష్ మహా..

సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాను ట్రోల్ చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్స్.. కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై డైరెక్టర్ వెంకటేశ్ స్పందిచారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Venkatesh Maha: భాష తప్పేమో.. భావం అయితే తప్పు కాదు.. వివాదంపై స్పందించిన డైరెక్టర్ వెంకటేష్ మహా..
Venkatesh Maha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2023 | 12:06 PM

ఇటీవల కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కేజీయఫ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇంటర్వ్యూలో వెంకటేశ్ సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్స్ వేశాడు. దీంతో అతడి కామెంట్స్ పై నెటిజన్స్.. కేజీఎఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాను ట్రోల్ చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్స్.. కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై డైరెక్టర్ వెంకటేశ్ స్పందిచారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

ఆ సినిమా స్టోరీపై తన అభిప్రాయం సరైనదే అని.. కానీ తాను వాడిన భాష కరెక్ట్ కాదన్నాడు. “రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఓ అభిప్రాయం చాలా మందికి నచ్చలేదని తెలిసిందే. నా అభిప్రాయాన్ని నేను వెనక్కు తీసుకోవడం లేదు. ఇప్పటికీ నా ఓపెనియన్ మీదనే నిలబడ్డాను. కానీ నేను మాట్లాడిన భాష మాత్రం కరెక్ట్ కాదు. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటూ మెసెజ్ లు పెట్టారు. కాబట్టి వాళ్ల తరపున నా వాయిస్ వినిపించాను. కేవలం నేను వాడిన భాష మాత్రమే కరెక్ట్ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్ పర్సన్ కాదు. ” అంటూ చెప్పుకొచ్చారు.

తాను కేవలం కల్పిత పాత్రను మాత్రమే కామెంట్ చేశానని.. నిజమైన వ్యక్తిని కాదని.. ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని.. అన్నిటిని ఒకేలా చూస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తన అభిప్రాయాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలని కోరారు. కానీ తనను దూషించడం ఎంతవరకు కరెక్ట్ కాదని.. తనపై తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారని.. ఇదేం తనకు కొత్త కాదని.. చాలాసార్లు ఇలాంటివి ఎదుర్కొన్నట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..