ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. థియేటర్లలో మళ్లీ సందడి చేయనున్న తారక్‌ సినిమా.. ఈ నెలలోనే రీ రిలీజ్‌

ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల హిట్​ సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్​ ఖుషి, జల్సా, మహేశ్ బాబు పోకిరి, ప్రభాస్‌ వర్షం, వెంకటేశ్ నారప్ప, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి, చిరంజీవి ఘరానా మెగుడు, గ్యాంగ్‌ లీడర్‌ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. థియేటర్లలో మళ్లీ సందడి చేయనున్న తారక్‌ సినిమా.. ఈ నెలలోనే రీ రిలీజ్‌
Junior Ntr
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 1:38 PM

ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల హిట్​ సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్​ ఖుషి, జల్సా, మహేశ్ బాబు పోకిరి, ప్రభాస్‌ వర్షం, వెంకటేశ్ నారప్ప, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి, చిరంజీవి ఘరానా మెగుడు, గ్యాంగ్‌ లీడర్‌ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో మూవీ థియేటర్లలో రీ రిలీజ్‌ కానుంది . అదే జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఆంధ్రావాలా. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్లాఫ్‌గా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలాగే ఇందులోని పాటలు ఛార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఆంధ్రావాలా మూవీ ఆడియో లాంఛ్​కు అప్పట్లో 5 లక్షలకు పైగా అభిమానులు హాజరుకావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది.

ఆంధ్రావాలా సినిమాలో ఎన్టీఆర్‌ డబుల్ రోల్‌ పోషించారు.ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ యాక్షర్‌ ఎంటర్‌టైనర్‌లో రక్షిత హీరోయిన్‌గా నటించింది. సంఘవి, నాజర్‌, షయాజీ షిండె, బెనర్జీ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. సింహాద్రి లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత రిలీజ్‌ కావడం, దీనికి తోడు అప్పటికి ఫుల్‌ ఫామ్‌లో ఉన్న డ్యాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెరకెక్కించడంతో ఆంధ్రావాలాపై అభిమానుల అంచనాలు ఆకాశాఆన్ని అంశాయి. అయితే సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమాను థియేటర్లలో రీ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ నెలలోనే అని సమాచారం. మరి ఈసారి ఆంధ్రావాలా ఎలాంటి సెన్సేషన్‌ సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..