AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anicka Vikhraman: ప్రియుడి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిన ముఖం.. షాకింగ్ ఫోటోలు..

అతడి నుంచి రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించగా.. అనికా షేర్ చేసిన ఫోటోస్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా అలరించిన అనికా.. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ప్రియుడు అనూప్ చేసిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది.

Anicka Vikhraman: ప్రియుడి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిన ముఖం.. షాకింగ్ ఫోటోలు..
Anicka
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2023 | 1:06 PM

Share

ప్రేమే శాపమైంది. నమ్మి ప్రాణంగా ప్రేమిస్తే.. ప్రియుడి చేతిలోనే చావు దెబ్బలు తినింది. మానసికంగా.. శారీరకంగా హింసించడంతో తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ సినీ నటి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. మలయాళి నటి అనికా విక్రమాన్. తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లైపై సంచలన ఆరోపణలు చేసింది. అనూప్ తనపై దాడి చేశాడంటూ గాయాల తాలుకూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనికా. అతడి నుంచి రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించగా.. అనికా షేర్ చేసిన ఫోటోస్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా అలరించిన అనికా.. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ప్రియుడు అనూప్ చేసిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది.

” నేను అనూప్ పిళ్లై అనే వ్యక్తిని ప్రేమించాను. గత కొన్నేళ్లుగా అతను నన్ను మానసికంగా.. శారీరకంగా వేధిస్తున్నాడు. లాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత చేసిన తర్వాత కూడా అతను నన్ను భయపెడుతూనే ఉన్నాను. అతను నన్ను ఇంత టార్చర్ చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. తను నన్ను కొట్టాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి. మొదటిసారి చెన్నైలో నన్ను కొట్టినప్పుడు ఫిర్యాదు చేశాను. అప్పుడు నా కాళ్లపై పడి ఏడ్చాడు. దీంతో కేసు వెనక్కు తీసుకున్నాను. ఇప్పుడు మరోసారి నన్ను వేధిస్తున్నాడు. అందుకే ఇప్పుడు రెండోసారి బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను.

ఇవి కూడా చదవండి

మొదట నన్ను చెన్నైలో కొట్టాడు. ఆరోజు జరిగిన సంఘటన తర్వాత నన్ను వదిలేయమని పోలీసులకు చెప్పొద్దని వేడుకున్నాడు. ఇప్పుడు రెండోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ ఈసారి అతను పోలీసులకు డబ్బులిచ్చి మ్యానేజ్ చేశాడు. తనకు పోలీసులు సపోర్ట్ చేస్తారని భావించి తిరిగి నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా అతడిని నమ్మి చాలాసార్లు మోసపోయానని.. ఇప్పుడు అతడిని వదిలేయాలని ఫిక్స్ అయ్యాయని.. కానీ అతడు తనను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేడని.. తన ఫోన్ పగలగొట్టడంతో షూటింగ్స్ కూడా వెళ్లలేకపోయానని.. తన వాట్సాప్ ల్యాప్ ట్యాప్ కు కనెక్ట్ చేసి తనకు తెలియకుండానే చాటింగ్స్ చూస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇక మరో వారం రోజులు తాను ఇన్ స్టాలోకి రాలేనని చెప్తూ. గాయాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.