Richie Trailer: ఆహాలోకి మరో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘రిచీ’ ట్రైలర్ వచ్చేసింది..
నివిన్ పౌలీ, నట్టి నటరాజ్, శ్రద్ధా శ్రీనాధ్, ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించారు. మ్యూజిక్ డైరెక్టర్ బి. అంజనీష్ సంగీతం
సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను అందిస్తుంది తెలుగు ఓటీటీ మాధ్యామం ఆహా. డిజిటల్ ప్లాట్ ఫాం రంగంలో వినూత్న వెబ్ సిరీస్, టాక్ షోస్.. గేమ్ షోస్, కుకింగ్ షోలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల సూపర్ హిట్ చిత్రాలను అందిస్తున్న ఆహా.. ఇతర భాషల్లో సూపర్ హిట్ చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న సస్పె్స్స్ థ్రిల్లింగ్ మూవీ రిచీ (Riche) సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నివిన్ పౌలీ, నట్టి నటరాజ్, శ్రద్ధా శ్రీనాధ్, ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించారు. మ్యూజిక్ డైరెక్టర్ బి. అంజనీష్ సంగీతం అందించిన ఈ సినిమా తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో ఆహా ఓటీటీలో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలోనే తాజాగా రిచీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఒక చిన్న ఘటన వెనక ఎన్నో కథలున్నాయి.. ఆ ఘటనకు కారణమైన ఒకే వ్యక్తి.. అతని చుట్టూ ఉన్న మరిన్ని స్టోరీస్..ఆద్యంతంగా ఉత్కంఠంగా సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ సినిమా మార్చి 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.