Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: సానియా ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో కనిపించని భర్త షోయబ్.. అందుకే డుమ్మా కొట్టాడా?

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భర్త షోయబ్ మాలిక్ మధ్య దూరం పెరగడం నిజమేనా? వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

Sania Mirza: సానియా ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో  కనిపించని భర్త షోయబ్.. అందుకే డుమ్మా కొట్టాడా?
Sania Mirza
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 3:12 PM

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భర్త షోయబ్ మాలిక్ మధ్య దూరం పెరగడం నిజమేనా? వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. తాజాగా, వారి మధ్య సఖ్యత లేదని, విడిపోవడం ఖాయమంటూ మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్‌కు, ఆ తర్వాత ఏర్పాటుచేసిన విందుకు భర్త షోయబ్ మాలిక్ హాజరు కాకపోవడమే ఈ ఊహాగానాలకు కారణం. ఫిబ్రవరి 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం జరగ్గా, అదే రోజు రాత్రి సానియా విందు ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, హీరో దుల్కర్‌ సల్మాన్‌, భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తదితరులు సానియాపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహ్మాన్‌, ప్రిన్స్‌ మహేశ్‌ బాబు- నమ్రత దంపతులు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

అయితే సానియా గౌరవార్థం జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ కనిపించకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా షోయబ్‌ ఆచూకీ ఎక్కడా? అంటూ ఆరా తీస్తున్నారు. సానియా-షోయబ్‌ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సానియా ఫేర్‌వెల్‌ ఈవెంట్స్‌కు షోయబ్‌ హాజరుకాకపోవడంతో వీరి మధ్య పొరపచ్చాలు నిజమేనంటున్నారు నెటిజన్లు. అంతేకాదు త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సానియా దంపతుల్లో ఒకరైనా స్పందించాల్సిందే. అయితే షోయబ్‌ మాలిక్‌ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌ 2023)లో ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను బిజీగా ఉండడంతోనే సానియా ఫేర్‌వెల్‌ ఈవెంట్స్‌కు రాలేకపోయాడని మరికొందరు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..