- Telugu News Photo Gallery Technology photos IQOO Z7 5G officially confirmed to launch in India on March 21 check out for details
iQOO Z7 5G: అదుర్స్ అనిపించే ఫీచర్లతో లాంచ్ కాబోతున్న ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు, కెమెరా వివరాలివే..
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వివో యాజమాన్యంలోని ఐక్యూ కంపెనీ వివిధ రకాల ఫోన్లను ప్రవేశపెట్టి ఇతర కంపెనీలకు గట్టి పోటినిస్తోంది. ఆ క్రమంలోనే ఐక్యూ కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌తో రానుంది. ఈ మేరకు ఆ ఫోన్ ఫోటోలను రివీల్ చేసి స్మార్ట్‌ఫోన్ ప్రియులలో క్యూరియాసిటీని పెంచేసింది. మరి ఆ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేమిటంటే..?
Updated on: Mar 10, 2023 | 8:33 PM

IQ విడుదల చేయబోతున్న కొత్త ఫోన్ పేరు IQ Z7 (iQOO Z7). మార్చి 21న భారత మార్కెట్‌లోని రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాని కంపెనీ.. IQ Z6 వారసుడిగా పేర్కొంది.

IQ Z7తో పాటు IQ Z6x ఫోన్‌ను కూడా లాంచ్ అవుతుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. అయితే IQ Z7 స్మార్ట్‌ఫోన్ గురించి పెద్దగా ఏమీ వెల్లడించలేదు. వెల్లడించిన ఫోటో ప్రకారం దాపి చిత్రం ఒక వీల్‌తో కప్పబడి ఉంది.

IQ Z7 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారిక సమాచారం లేదు. అయితే మూలాల ప్రకారం, ఇది 1080 x 2408 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

MediaTek డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్ స్పీడ్‌ని కలిగి ఉంటుంది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ 13 సపోర్ట్‌తో పని చేస్తుంది.

ఇంకా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ని పొందే అవకాశం ఉంది. ప్రధాన కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్ అయితే, సెకండరీ కెమెరా 2-మెగాపిక్సెల్ సెన్సార్. ఇది 16-మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉండవచ్చు.

IQ Z7 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో పాటు.. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ ఇవ్వగలదు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000. కంటే తక్కువగా ఉంటుందని అంచనా.





























