AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Python: భారీ పైథాన్‌ను పెంచుకుంటున్న యువతి.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న కొండచిలువ వీడియో.. ఓ సారి మీరూ చూడండి..

అరుదైన సందర్భాలలోనే కొందరు చిరుతలు, పులులను పెంచుకున్న వార్తలను చూస్తుంటాం. అయితే పాములను పెంచుకోవడాన్ని, లేదా దానికి సంబంధించిన..

Giant Python: భారీ పైథాన్‌ను పెంచుకుంటున్న యువతి.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న కొండచిలువ వీడియో.. ఓ సారి మీరూ చూడండి..
Young Woman With Giant Python
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 10, 2023 | 9:04 PM

Share

మనలో చాలా మంది పిల్లులను, కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటాం. లేదా పక్షులు, చేపలు, కుందేళ్లు.. అంతే కదా ! చాలా అరుదైన సందర్భాలలోనే కొందరు చిరుతలు, పులులను పెంచుకున్న వార్తలను చూస్తుంటాం. అయితే పాములను పెంచుకోవడాన్ని, లేదా దానికి సంబంధించిన వార్తను ఎప్పుడైనా మీరు విన్నారా..? అవును. ఓ యువతి ఓ పెద్ద భారీ ఆకారంలో ఉన్న కొండ చిలువను పెంచుకుంటుంది. ఆ పైథాన్ కూడా ఆమెను ఏం అనకుండా తన ఒడిలో పడుకుని నెమ్మదిగా కదులుతూ సేద తీరుతుంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో పైథాన్‌ను పెంచుకుంటున్న ఆ యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట పెద్ద సెన్సేషనల్ ట్రెడింగ్ వీడియోగా మారింది.

Wow Terrifying అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో మనం పైన చెప్పుకున్న దృశ్యాలను చూడవచ్చు. వీడియోలో ఆ యువతి తన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తూ ఉండగా.. ఆ కొండ చిలువ తన ఒడిలో తల పెట్టి పడుకుని ఉంది. ఆ యువతి కూడా కొండ చిలువను చూసి ఏ మాత్రం భయపడకుండా ప్రశాంతంగా తన ఫోన్‌ను ఉపయోగించుకునే పనిలో ఉంది. ఈ వీడియోను చూసి మీరు గ్రాఫిక్స్ అంటారేమో..? అసలు కానే కాదు. గ్రాఫిక్స్ అనడానికి వీల్లేకుండా నిజమైన సీన్ అనేట్టుగానే ఉంది. ఇక ఈ వీడియో మార్చి 3న నెట్టింట ప్రత్యక్షం కాగా, ఇప్పటివరకు 7 లక్షల వీక్షణలు, 6300 లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు  సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ వీడియోపై విభిన్న అభిప్రాయాలతో కామెంట్లు చేస్తున్నారు.  ఆ పైథాన్‌తో ఆమెకు విడదీయరాని బంధం పెనవేసుకుపోయిందని.. ఆ యువతికి ఏ మాత్రం ఖాళీ సమయం చిక్కినా ఇలా గార్డెన్‌లోకి వచ్చి ఈ భారీ పైథాన్‌తో కాలక్షేపం చేస్తుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ వీడియో చూస్తే.. అంత భారీ సైజులో ఉన్న పైథాన్ తన ఉన్నా.. ఆ అమ్మాయి అసలు ఏ మాత్రం పట్టనట్టుగా ఉన్న తీరు చూస్తోంటే.. ఆమెకు ఆ పైథాన్‌తో ఎంత స్నేహం ఉంటేనే అలా భయం లేకుండా భరిస్తుంద’ని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..