AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాక్‌లో దంచికొట్టిన పంత్ టీంమేట్.. 237 స్ట్రైక్‌రేట్‌తో టీ20ల్లో అరుదైన రికార్డ్.. కట్‌చేస్తే.. దుమ్మురేపే డ్యాన్స్‌‌తో రచ్చ..

Pakistan Super League: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 240కి పైగా పరుగులు చేసినప్పటికీ, పెషావర్ బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో జట్టు మరోసారి విఫలమైంది.

Video: పాక్‌లో దంచికొట్టిన పంత్ టీంమేట్.. 237 స్ట్రైక్‌రేట్‌తో టీ20ల్లో అరుదైన రికార్డ్.. కట్‌చేస్తే.. దుమ్మురేపే డ్యాన్స్‌‌తో రచ్చ..
Psl Fastest Century
Venkata Chari
|

Updated on: Mar 11, 2023 | 8:12 AM

Share

పదునైన బౌలింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్ 2023)లో ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. కాగా, బ్యాట్స్‌మెన్‌ల భీకర పోరు కారణంగా మరింత హిట్‌ పెరిగింది. పీఎస్ఎల్ 2023 బౌలర్లకు పీడకలగా మారింది. భారీ స్కోర్ చేసినా.. దానిని కాపాడుకోవడంలో ప్రత్యర్థి టీం బౌలర్లు విఫలమవుతున్నారు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రస్సో తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్‌లకు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ PSL చరిత్రలో అత్యంత భీకర ఇన్నింగ్స్‌లు ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును నెలకొల్పేందుకు 41 బంతులు మాత్రమే పట్టింది.

మార్చి 10, శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు దంచేశారు. ఇరు జట్లు భారీ స్కోర్‌ నమోదు చేశాయి. వరుసగా రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ 240కి పైగా పరుగులు చేసింది. రెండు రోజుల క్రితం 240 పరుగులు చేసి ఓడిపోయిన పెషావర్ ఈసారి 242 పరుగులు చేసినా అది సరిపోకపోవడానికి రిలే రస్సో అతిపెద్ద కారణంగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

41 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..

కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఔటైన రెండో ఓవర్‌లోనే ఈ ఎడమచేతి వాటం ఆఫ్రికన్ బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చాడు. రూసో రాగానే రావల్పిండి స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. రస్సో తన అర్ధ సెంచరీని కేవలం 17 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది PSLలో ఉమ్మడి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత రూసో తన అటాకింగ్ శైలితో మరింత రెచ్చిపోయాడు. 16వ ఓవర్లో ఫాస్టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు.

రూసో కేవలం 41 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి పీఎస్ఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డు సృష్టించాడు. రూసో 2020లో తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు క్వెట్టాపై 43 బంతుల్లో సెంచరీ సాధించాడు.

243 టార్గెట్..

19వ ఓవర్‌లో ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు అజ్మతుల్లా ఒమర్జాయ్ రంగంలోకి దిగి, పెవిలియన్ చేర్చాడు. కానీ, అప్పటికే రూసో తన పనిని పూర్తి చేశాడు. రూసో 51 బంతుల్లో (12 ఫోర్లు, 8 సిక్సర్లు) 121 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా, ముల్తాన్ 243 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని కూడా సాధించింది. మొదటి 5 బంతుల్లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. పీఎస్‌ఎల్‌లో అతిపెద్ద పరుగుల వేటగా ఇది కొత్త రికార్డుగా నిలిచింది. రూసోతో పాటు కీరన్ పొలార్డ్ (52 పరుగులు, 25 బంతుల్లో), అన్వర్ అలీ (24 నాటౌట్, 8 బంతుల్లో) ఆకట్టుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..