చిన్న వయసులోనే ప్రాణాలు తీసేస్తున్న గుండె.. అమెరికాలో కార్డియాక్ అరెస్ట్‌తో తెలుగు విద్యార్థి మృతి
Telugu student cardiac arrest: గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పట్టుమని పాతికేళ్లు కూడా లేని వాళ్ళు ఉన్నఫళంగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి.
గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పట్టుమని పాతికేళ్లు కూడా లేని వాళ్ళు ఉన్నఫళంగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్‌లతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్థి హఠాన్మరణం చెందాడు. 23 ఏళ్ల బొడగల వంశీ రెడ్డయ్య అనే విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడు. న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గత ఏడాది ఆగస్టు నెలలో యూఎస్ వెళ్లాడు.
పౌకీప్సీలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు వంశీ రెడ్డయ్య. గురువారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన వంశీ.. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవలేదు. దీంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వంశీరెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్థారించారు. వంశీ తండ్రి లవకుమార్ ప్రముఖ తెలుగు దినపత్రికలో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వంశీరెడ్డి మృతదేహం నగరానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు..
కోవిడ్ టైమ్‌లో ప్రతీఒక్కరికీ ఇమ్యూనిటీ పవర్ అత్యవసరంగా మారింది. ఇమ్యూనిటీని పెంచుకోడానికి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్న తాపత్రయం అందరిలోనూ కలిగింది. ఇదే గ్యాప్‌లో 6 మంత్స్‌లోనే 6 ప్యాక్ బాడీ… తక్కువ టైమ్‌లోనే మజిల్ గ్రోత్… ఇవిగో పవర్‌ఫుల్ ట్యాబ్లెట్లు- ఇంజెక్షన్లు అంటూ యువతను రెచ్చగొట్టే స్టెరాయిడ్స్ కూడా గుండె పటుత్వాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్కవుట్స్ చేసిన వెంటనే శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోకుండా స్టెరాయిడ్స్ నిరోధిస్తాయి. బీపీ, పల్స్ రేట్‌లను కంట్రోల్ చేయడంలో స్టెరాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే… డాక్టర్ సజెస్ట్ చేయని కొన్ని కృత్రిమ స్టెరాయిడ్సే కొంప ముంచేది. అవి తీసుకుంటే గుండె మీద దుష్ప్రభావం చూపే ప్రమాదముంది. ఇప్పుడు మనం చూస్తున్న కార్డియాక్ అరెస్టులకు ఈ స్టెరాయిడ్స్ కూడా ఓ కారణం కావొచ్చంటున్నారు డాక్టర్లు.
మానసిక ఒత్తిడి, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లలో తేడాలు…! వీటన్నిటికీ అతీతంగా మరేదో కారణం… మన గుండెల్ని శాసిస్తోందన్నది క్లియర్. ఇంగ్లీష్ మెడిసిన్‌ని గుడ్డిగా నమ్మడం కూడా ఈ హృదయవేదనకు దారితీసిందన్నది పెద్దల మాట. మధ్యవయసులోనే చోటుచేసుకుంటున్న ఈ ఆకస్మిక మరణాల నేపథ్యంలో… దేశీయ, సంప్రదాయక వైద్యవిధానాలకు గిరాకీ పెరిగినా పెరగొచ్చట. ఏదైతేనేం… గుండె భద్రం బ్రదరూ అంటూ రెగ్యులర్ చెకప్‌ని కంపల్సరీ చేస్తున్నారు మన వైద్యులు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..