Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: చిన్న వయసులోనే పెళ్లి..ఓ బిడ్డకు తల్లి.. భర్త ప్రోత్సాహంతో కానిస్టేబుల్ నుంచి నేడు డీఎస్పీ.. బబ్లీ సక్సెస్ స్టోరీ

అప్పడు బబ్లీ భర్తకు అండగా నిలబడ్డాడు. భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే..తాను ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో బబ్లీ  ఉన్నత పదవి కోసం చదవడం మొదలు పెట్టింది. సవాళ్లను ఎదుర్కొంటూ బబ్లీ తన మూడో ప్రయత్నంలో బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

Success Story: చిన్న వయసులోనే పెళ్లి..ఓ బిడ్డకు తల్లి.. భర్త ప్రోత్సాహంతో కానిస్టేబుల్ నుంచి నేడు డీఎస్పీ.. బబ్లీ సక్సెస్ స్టోరీ
Success Story Babli Kumari
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2023 | 1:37 PM

కృషి పట్టుదల చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించాలనే ధృడ సంకల్పం ఉంటే మిమ్మల్ని  విజయం సాధించకుండా ఏ శక్తీ అడ్డుకోదు అని అంటారు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తే.. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఓ మహిళ.  మహిళా కానిస్టేబుల్ ఒకప్పుడు తాను సెల్యూట్ చేసే అధికారులకు కూడా ఇప్పుడు బాస్‌గా మారింది. ఆ సక్సెస్ ఫుల్ మహిళ.. బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి కానిస్టేబుల్ నుంచి  డీఎస్పీగా మారిన బబ్లీ విజయగాథ. బాబ్లీ విజయంపై పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె విజయగాథ కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది. బబ్లీ కుమారి పోరాటాన్ని గురించి తెలుసుకుందాం..

బీహార్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబ్లీ ఇప్పుడు డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 66వ పరీక్షలో 208వ ర్యాంకుతో బబ్లీ ఉత్తీర్ణత సాధించారు. వాస్తవానికి బాబ్లీకి ఈ విజయం అంత తేలికగా లభించలేదు.. ఈ విజయం వెనుక పెద్ద పోరాటమే చేసింది.

బబ్లీ కుమారి పేద కుటుంబం.. కష్టపడి చదువుకుంది. తల్లిదండ్రులు తమ భాద్యతను తీర్చుకోవడం కోసం 2013 సంవత్సరంలో వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉద్యోగ ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది. 2015లో బాబ్లీకి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆమెకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఓ వైపు ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు భర్త ప్రోత్సాహంతో మళ్ళీ ఉన్నత పదవి కోసం చదువుకోవడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

అత్తమామల నుంచి మద్దతు లభించింది మీడియా కథనాల ప్రకారం, బాబ్లీ పెళ్లి తర్వాత చదువుకోవాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఆమె అత్తమామలు కూడా ఆమెకు బాగా మద్దతు ఇచ్చారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చిన అనంతరం ఓ వైపు పోలీస్ స్టేషన్ లో విధులను నిర్వహిస్తూనే.. మరోవైపు బీపీఎస్సీకి ప్రిపేర్ అయింది. అయితే బబ్లీ త్రిపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. ఓ వైపు డ్యూటీ.. మరోవైపు చదువు.. ఇక ఓ బాబుకు తల్లి.. దీంతో చదువు ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది.

అప్పడు బబ్లీ భర్తకు అండగా నిలబడ్డాడు. భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే..తాను ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో బబ్లీ  ఉన్నత పదవి కోసం చదవడం మొదలు పెట్టింది. సవాళ్లను ఎదుర్కొంటూ బబ్లీ తన మూడో ప్రయత్నంలో బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానిస్టేబుల్‌ నుంచి  డీఎస్పీ గా మారిన బబ్లీ  రాజ్‌గిర్ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంది. అంతకుముందు, బెగుసరాయ్‌కు చెందిన SP యోగేంద్ర కుమార్‌ బబ్లీని సత్కరించారు.

BPSC 66వ పరీక్షలో విజయం బీపీపీఎస్సీ 66వ పరీక్షలో మొత్తం 685 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఈ పరీక్షలో బబ్లీ కుమారి 208వ ర్యాంకు సాధించింది. అప్పుడు ఆమె తన బిడ్డను ఒడిలో పెట్టుకుని దిగిన ఫోటో కూడా వైరల్ అయింది.

కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీగా మారిన బాబ్లీ.. ఇక్కడికి చేరుకోవడం తన ప్రయాణం అంత సులభం కాదని చెప్పారు. తాను తమ కుటుంబానికి పెద్ద కూతురు. అనేక బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే ప్రభుత్వ ఉద్యోగమే మార్గమని కష్టపడి చదివి ఈ రోజు డీఎస్పీగా మారిన బబ్లీ కుమారి నేటి యువతకు స్ఫూర్తి..

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..