Maharashtra Doctor: డాక్టర్ కాదు దైవం.. ఆ ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం.. 11 ఏళ్లలో 2470 డెలివరీలు..

ఆస్పత్రిలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే వారికి బిడ్డ పుట్టినప్పటినుంచి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరేవరకూ వైద్యం మొత్తం ఉచితంగా చేస్తారు. ఇది ఒకనాటిది కాదు. ఇలా ఆయన 11 ఏళ్లుగా ఈ సేవ చేస్తున్నారు. అందుకే చాలామంది ఆయనను పిచ్చి డాక్టర్‌ అన్నారు. కానీ ఆ పిచ్చి డాక్టరు చేసే సేవ ఈరోజు ఖండంతారాలకు చేరి ప్రశంసలు అందుకుంటోంది.

Maharashtra Doctor: డాక్టర్ కాదు దైవం.. ఆ ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం.. 11 ఏళ్లలో 2470 డెలివరీలు..
Dr. Ganesh Rakh
Follow us
Surya Kala

|

Updated on: Mar 25, 2023 | 9:40 AM

వైద్యోనారాయణ హరిః అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. ప్రాణం పోసేది భగవంతుడైతే.. ప్రాణం నిలిపేది వైద్యుడు. అందుకే భగవంతుడి తర్వాత చెయ్యెత్తి మొక్కేది ఒక్క డాక్టర్‌కే. ప్రస్తుత కాలంలో వైద్యం వ్యాపారం అయిపోయింది. పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారి సమయానికి సరైన చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి పాలిట దైవంగా నిలిచారు డాక్టర్‌ గణేష్‌ రాఖ్‌. ఆయన ఓ గైనకాలజిస్ట్‌.. అతని చేతులమీదుగా ఎందరో ఊపిరి పోసుకున్నారు. ఇక ఆడపిల్ల అంటే అతనికి అమితమైన ఇష్టం.. ఆడబిడ్డను సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే తన ఆస్పత్రిలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే వారికి బిడ్డ పుట్టినప్పటినుంచి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరేవరకూ వైద్యం మొత్తం ఉచితంగా చేస్తారు. ఇది ఒకనాటిది కాదు. ఇలా ఆయన 11 ఏళ్లుగా ఈ సేవ చేస్తున్నారు. అందుకే చాలామంది ఆయనను పిచ్చి డాక్టర్‌ అన్నారు. కానీ ఆ పిచ్చి డాక్టరు చేసే సేవ ఈరోజు ఖండంతారాలకు చేరి ప్రశంసలు అందుకుంటోంది.

మహారాష్ట్రకు చెందిన డా.గణేష్‌ రాఖ్‌ అద్భుత సంకల్పానికి ముగ్గురు మహిళామణులు అండగా నిలిచారు. కులమతాలకు అతీతంగా జనహితమే పరమావధిగా భావించి డాక్టర్‌కు తమవంతు సాయం అందించారు. ఇక్కడ ఇంకో విశేషమేమంటే.. ఈ ముగ్గురు స్త్రీ మూర్తులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు చెందినవారు. వారే షగుఫ్తా ముస్తఫ్‌ఖాన్‌, అనురాధ సదాశివ్‌ గోపాలె, జెన్నిఫర్ ఎరిక్‌ మనేజెస్‌. వారి సాయంతోనే 2007లో గుడిపడ్వా పండగరోజు అంటే ఉగాది రోజున హడాప్సర్‌ పట్టణంలో మెడికేర్‌ హాస్పిటల్‌ ప్రారంభించారు గణేష్‌. నామమాత్రపు అద్దె తీసుకుంటూ ముగ్గురూ మూడు భవనాలను ఆస్పత్రి ఏర్పాటుకు ఇచ్చారు. ఆరోజే డాక్టర్‌ గణేష్‌.. తన ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే.. ఆ తల్లిదండ్రులనుంచి ఎలాంటి రుసుమూ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఈ ఏడాది ఉగాదితో 11 ఏళ్లు పూర్తయ్యాయి.

ఇప్పటి వరకూ ఈ ఆస్పత్రిలో 2470 మందికి ఉచితంగా డెలివరీలు చేశారు. ఉచిత వైద్యం గురించి ప్రకటించినప్పుడు ఆయనను అందరూ మ్యాడ్‌ డాక్టర్‌ అన్నారు. ఇప్పుడు వారే ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మహత్తరకార్యంలో పాలుపంచుకోడానికి ముందుకొస్తున్నారు. గణేశ్‌ రాఖ్‌ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. ‘సేవ్ గర్ల్‌ చైల్డ్‌’ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న డా.గణేశ్‌ రాఖ్‌ కు అనేక దేశాల నుంచి ఆహ్వానం అందింది. త్వరలో అక్కడ ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..