Parrot’s Testimony: విశ్వాసం అంటే ఈ చిలుకదే.. యజమానురాలిని హత్య చేసిన నిందితుడిని పట్టించి.. మరణించిన చిలుక.. 9 ఏళ్ల తర్వాత జైలు శిక్ష..

హత్యను చిలుక ప్రత్యక్షంగా చూసి  ఉండవచ్చని శర్మ అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు విజయ్ చిలుక దగ్గర అనుమానితులను ఒక్కొక్కటిగా పేరు చెప్పడం  ప్రారంభించారు. ఆశు పేరు పలకగానే చిలుక భయపడి "అషు-అషు" అని అరవడం ప్రారంభించింది.

Parrot's Testimony: విశ్వాసం అంటే ఈ చిలుకదే.. యజమానురాలిని హత్య చేసిన నిందితుడిని పట్టించి.. మరణించిన చిలుక.. 9 ఏళ్ల తర్వాత జైలు శిక్ష..
Parrot's Testimony
Follow us

|

Updated on: Mar 25, 2023 | 10:50 AM

మనుషులు డబ్బు పట్ల వ్యామోహంతో  బంధాలు,బంధుత్వాన్ని మరచిపోతూ మృగంగా మారుతుంటే.. తనను అపురూపంగా పెంచిన యజమానురాలి పట్ల తన ప్రేమను.. కృతజ్ఞతను ప్రకటించుకుంది ఓ పెంపుడు పక్షి.. తన యజమానురాలిని చంపిన హంతకుడిని పట్టించింది పెంపుడు రా చిలుక ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆగ్రా వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ విజయ్ శర్మ భార్య నీలం శర్మ తొమ్మిదేళ్ల క్రితం అంటే.. ఫిబ్రవరి 20, 2014న తన  ఇంట్లో  హత్య చేయబడింది. హత్య తర్వాత నీలం ఇంటిలో చోరీ జరిగింది. అయితే హత్యకు గల కారణాలను.. నిందితుడిని పోలీసులు గుర్తించలేదు. విజయ్ శర్మ పెంపుడు చిలుక శర్మ మేనల్లుడి పేరు చెప్పి అరవడం ప్రారంభించింది. చిలుక అరుపులు విన్న విజయ్ శర్మకు అనుమానం వచ్చి మేనల్లుడిని ప్రశ్నించాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు.

పోలీసుల విచారణలో మేనల్లుడు అషు తన స్నేహితుడు రోనీ మాస్సే సహాయంతో నీలమ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈరోజు, హత్య జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత.. ప్రత్యేక న్యాయమూర్తి మహ్మద్ రషీద్ నిందితులు అషు, రోనీ  ఇద్దరికీ జీవిత ఖైదు శిక్షను విధించారు. ఆశు  హత్య చేసినందుకు అంగీకరించడంతో పాటు సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులకు రూ. 72,000 జరిమానా విధించారు.

విజయ్ శర్మ తన కొడుకు రాజేష్ , కుమార్తె నివేదితతో కలిసి ఫిరోజాబాద్‌లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు ఫిబ్రవరి 20, 2014న ఇంటి నుండి వెళ్లారు. ఆ సమయంలో నీలం ఇంట్లోనే ఉండిపోయింది. విజయ్ అర్థరాత్రి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నాడు. తన భార్య నీలం, పెంపుడు కుక్క మృతదేహాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో పదునైన వస్తువుతో ఇద్దరిని హత్య చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో కొందరు అనుమానితులను పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్ శర్మ పెంపుడు చిలుక మాత్రం తినడం, తాగడం మానేసి సైలెంట్ అయిపోయింది. హత్యను చిలుక ప్రత్యక్షంగా చూసి  ఉండవచ్చని శర్మ అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు విజయ్ చిలుక దగ్గర అనుమానితులను ఒక్కొక్కటిగా పేరు చెప్పడం  ప్రారంభించారు. ఆశు పేరు పలకగానే చిలుక భయపడి “అషు-అషు” అని అరవడం ప్రారంభించింది. పోలీసుల ఎదుట కూడా చిలుక ఆశు పేరుని పదే పదే పలకరించడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో కూడా ప్రస్తావించారు.

నీలమ్ శర్మ కుమార్తె నివేదిత శర్మ తన హత్య గురించి మాట్లాడుతూ.. అషు తమ ఇంటికి వచ్చి వెళ్లేవారని.. ఇలా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పింది. అషు ఎంబీఏ చదివేందుకు తన తండ్రి రూ.80వేలు కూడా ఇచ్చారని చెప్పారు. తమ ఇంట్లో ఆభరణాలు, నగదు ఎక్కడ ఉంచారో ఆషుకు తెలుసని.. దీంతో దోపిడీకి ప్లాన్ చేసి ఉంటాడని నివేదిత చెప్పింది. అతను పదునైన కత్తితో పెంపుడు కుక్కను 9 సార్లు, నీలమ్‌ను 14 సార్లు పొడిచాడు. తల్లిని చంపి అయినా సరే దోచుకోవాలని అతడిని ఏకైక ఉద్దేశమని నివేదిత శర్మ తెలిపింది.

అయితే ఈ హత్యకేసులో చిలుక గురించి ప్రస్తావన వచ్చింది. అయితే చట్టంలో చిలుక సాక్ష్యం గురించి ఎటువంటి నిబంధన లేదు. కనుక చిలుక సాసాక్ష్యాన్ని సమర్పించలేదు. అయితే తన తల్లి హత్య జరిగిన ఆరు నెలలకే చిలుక చనిపోయిందని నివేదిత తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో విజయ్ శర్మ నవంబర్ 14, 2020న మరణించారు. “తన తల్లిని హత్య చేసిన నిందితుడు ఆశును ఉరితీయాలని కోరుకుంటున్నామని.. అతనిని శిక్షించాలని కుటుంబం మొత్తం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..